ఏపీలో కొత్తగా 8వేలకుపైగా కరోనా కేసులు: లక్ష దిగువకు యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 9వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 97,963 నమూనాలను పరీక్షించగా.. 8,110 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 8110 కరోనా కేసులు, 67 మరణాలు
తాజాగా నమోదైన 8110 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,87,883కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 67 మంది మృతి చెందారు.
చిత్తూరులో అత్యధికంగా 11 మంది మరణించగా, పశ్చిమగోదావరిలో 9 మంది, విశాఖపట్నంలో ఏడుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, గుంటూరులో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, కడపలో ముగ్గురు, నెల్లూరు ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 11,763కు చేరింది.

ఏపీలో పడిపోతున్న యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 12,981 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 16,77,063కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 99,057 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,01,37,627 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1416 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో 235 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 906, చిత్తూరులో 1042, తూర్పుగోదావరిలో 1416, గుంటూరులో 512, కడపలో 508, కృష్ణాలో 576, కర్నూలులో 235, నెల్లూరులో 280, ప్రకాశంలో 600, శ్రీకాకుళంలో 461, విశాఖపట్నంలో 502, విజయనగరంలో 280, పశ్చిమగోదావరిలో 792 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,44,210, చిత్తూరులో 2,04,555 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో లక్షకు మించిపొయాయి.












Click it and Unblock the Notifications