టెన్షన్, స్పీకర్‌పై ఆగ్రహం: వైసీపీ సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ గురువారం నాడు కూడా హాట్ హాట్‌గా సాగుతోంది. ఉదయం సభ ప్రారంభం కాగానే.. తమకు మైక్ ఇవ్వలేదంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సభ పది నిమిషాలు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమయ్యాక పరిస్థితిలో మార్పు కనిపించలేదు.
సభ ప్రారంభం కాగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ నిరసన తెలిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. సభాపతి కోడెల శివప్రసాద రావు ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలను మూడు రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేశారు.

సస్పెండైన వారిలో.. శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ముత్యాలనాయుడు, కొడాలి నాని, జగ్గిరెడ్డి, రామకృష్ణా రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, చాంద్ బాషాలను సస్పెండ్ చేశారు.
వారిని సస్పెండ్ చేసిన అనంతరం.. సభ నుండి బయటకు వెళ్లాలని స్పీకర్ వారిని కోరారు. అయితే, తమ సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టారు. మరోవైపు సస్పెండైన సభ్యులు సభలోనే స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను మరోసారి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications