వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు చీవాట్లు పెట్టడానికి తగిన కేసని ఈసీ: నోటీసు ఆలస్యం ఎందుకంటే?

చంద్రబాబుపై చేసిన కాల్చివేత వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వైసిపి అధినేత జగన్‌కు నోటీసులు ఇచ్చింది. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో నోటీసులు రావడం చర్చకు తావిచ్చింది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: చంద్రబాబుపై చేసిన కాల్చివేత వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వైసిపి అధినేత జగన్‌కు నోటీసులు ఇచ్చింది. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో నోటీసులు రావడం చర్చకు తావిచ్చింది.

జగన్ వ్యాఖ్య-శిల్పాకు దెబ్బ: వైసిపి భయపడిందే జరిగిందా? అఖిలకు నిజంగా ప్లస్సా?జగన్ వ్యాఖ్య-శిల్పాకు దెబ్బ: వైసిపి భయపడిందే జరిగిందా? అఖిలకు నిజంగా ప్లస్సా?

తమను దెబ్బతీసేందుకు కుట్ర పూరితంగా ఉప ఎన్నికల నాడు జగన్‌కు నోటీసుల అంశం వెల్లడైందని వైసిపి ఆరోపించగా, ఈ నెల 21న కేంద్ర ఎన్నికల సంఘం పంపిస్తే రెండు రోజులు ఆలస్యమైందని, వైసిపికి నష్టం చేయకుండా ఆపినట్లుగా కనిపిస్తోందని టిడిపి నేతలు ఆరోపించారు.

అసలేం జరిగిందంటే

అసలేం జరిగిందంటే

వీరి ఆరోపణలపై తెలుగు రాష్ట్రాల ఈసీ భన్వర్ లాల్ స్పందించారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగన్‌కు నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆఖరి నోటీసు జారీ చేశారని ఆయన బుధవారం తెలిపారు. టిడిపి ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం (21వ తేదీన) ఆరు గంటలకు ఆఖరి నోటీసును పంపిందని తెలిపారు.

Recommended Video

Nandyal Bypoll : Cases Registered Against YS Jagan | Oneindia Telugu
అవే ముఖ్యం

అవే ముఖ్యం

తమ కార్యాలయం నుంచి అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఎన్నికల అధికారికి పంపించామని భన్వర్ లాల్ తెలిపారు. మంగళవారం పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసే క్రమంలో బుధవారం జారీ చేసినట్లు తెలిపారు. పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారన్నారు. ఆ సమయంలో నోటీసుల కంటే ఎన్నికల ప్రక్రియ అంతకంటే ముఖ్యమని చెప్పారు. అందుకే నోటీసులు ఆలస్యమైందన్నారు.

జగన్ చేసిన వ్యాఖ్యలు తర్జుమా చేసి

జగన్ చేసిన వ్యాఖ్యలు తర్జుమా చేసి

జగన్‌పై టిడిపి ఫిర్యాదుల నేపథ్యంలో అక్కడి నుంచి నివేదికలు, వీడియో రికార్డింగులను రప్పించి, వాటిని తెలుగు నుంచి ఇంగ్లిషులోకి తర్జుమా చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని భన్వర్ లాల్ తెలిపారు. జాప్యం ఏమీ జరగలేద్నారు. పరిపాలనాపరమైన జాప్యమే జరిగిందన్నారు.

చివాట్లు పెట్టడానికి తగిన కేసు

చివాట్లు పెట్టడానికి తగిన కేసు

కాగా, సీఎం చంద్రబాబును రోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదంటూ జగన్ నంద్యాల ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. అతనిపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది.

జగన్ ప్రవర్తనను తప్పుపడుతూ..

జగన్ ప్రవర్తనను తప్పుపడుతూ..

జగన్ ప్రవర్తన తీరును తప్పుబడుతూ తీవ్రమైన హెచ్చరిక లేఖ కూడా జారీ చేయాలని ఎన్నికల అధికారులకు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారసభల్లో జగన్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది.

చీవాట్లు పెట్టడానికి తగిన కేసు

చీవాట్లు పెట్టడానికి తగిన కేసు

ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ఇలాంటి అనుచితమైన, రెచ్చగొట్టే భాషా ప్రయోగం హింసను ప్రేరేపించేలా ఉందని సీఈసీపేర్కొంది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో పేరా 1(2) కింద పేర్కొన్న నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుందని తెలిపింది. అందువల్ల ఇది చీవాట్లు పెట్టడానికి తగిన కేసు అని పేర్కొంది. ఈ విషయాన్ని తక్షణం రిటర్నింగ్‌ అధికారికి పంపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని సూచించింది. అనంతరం కేసు నమోదైన విషయం తెలిసిందే.

English summary
The Nandyal bypoll witnessed a record turnout with 80 per cent voting on Thursday. “This is the highest polling percentage in this constituency. Seventy-six per cent was recorded in 2009 and 71 per cent in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X