ఏపీలో కొత్తగా 8218 కరోనా కేసులు... మరో 58 మంది మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 8,218 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 58 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 5302కి చేరింది. ప్రస్తుతం 81763 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం(సెప్టెంబర్ 19) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో 10,820 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,30, 711కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 74,595 శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 50,33,676కు చేరింది.

8128 new coronavirus cases reported from andhra pradesh in last 24 hours

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 1395 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 1071 కేసులతో పశ్చిమ గోదావరి,736 కేసులతో చిత్తూరు ఉన్నాయి. ఇప్పటివరకూ అత్యధికంగా తూర్పు గోదావరిలో 85247 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక తాజాగా నమోదైన మరణాల్లో... చిత్తూరులో 9 మంది, కృష్ణా జిల్లాలో ఏడుగురు,అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పుగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+