వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

87 లక్షల మంది ఎస్సీలు, 26 లక్షల మంది ఎస్టీలు.. కోటీ మందికి పైగా సంక్షేమ ఫలాలు: విజయసాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

14 నెలల్లో కోటీ మందికి పైగా ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ ఫలాలు అందాయని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డితెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ సిఫారసులు అక్కర్లేకుండాపోయిందని ట్వీట్ చేశారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే అర్హులను గుర్తించామని చెప్పారు. గ్రామ వాలంటీర్లు అర్హులను గుర్తించడంతో వివిధ పథకాల కింద ప్రయోజనం కల్పించామని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి.

Recommended Video

భగవంతుడి దయ తోనే అంటూ.. Vijayasai Reddy ట్వీట్ || Oneindia Telugu

సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని.. విశాఖపై మాత్రం పగబట్టారు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డిసముద్రాన్ని కంట్రోల్ చేస్తానని.. విశాఖపై మాత్రం పగబట్టారు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి

పథకాల వారీగా లబ్ది పొందినవారి సంఖ్య..

వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద ఎస్సీలు 61 వేల 390 మంది, ఎస్టీలు 10 వేల 49 మందికి ప్రయోజనం కలిగిందని వివరించారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఎస్సీలు 4 లక్షల 54 వేల పై చిలుకు మంది, ఎస్టీలు 2 లక్షల 77 వేల పైచిలుకు మంది లబ్ది పొందారని వివరించారు. వైఎస్ఆర్ పెన్సన్ కానుక కింద ఎస్సీలు 9 లక్షల 44 వేల 248 మంది, వైఎస్ఆర్ సున్నా వడ్డీ 16 లక్షల 24 వేల 826 మంది, లా నేస్తాం 372 మంది, వైఎస్ఆర్ నేతన్న నేస్తం 852 మందికి ప్రయోజనం కలిగిందని చెప్పారు.

ఎస్టీలకు పెద్దపీట..

ఎస్టీలకు పెద్దపీట..

ఇక ఎస్టీలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 3 లక్షల 40 వేల పై చిలుకు మంది, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 3 లక్షల 28 వేల పైచిలుకు మంది ప్రయోజనం పొందారని వివరించారు. లా నేస్తం కిద 105 మంది, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 235 మందికి ప్రయోజనం కలింగిందని వివరించారు. అమ్మ ఒడి కింద 8 లక్షల 68 వేల 233 మంది, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద లక్ష 34 వేల పైచిలుకు మంది. ఆరోగ్య ఆసరా కింద 21 వేల పైచిలుకు మంది, జగనన్న వసతి దీవేన కింద 3 లక్షల 36 వేల పైచిలుకు మంది.. జగనన్న విద్యా దీవెన కింద 3 లక్షల 77 వేల పైచిలుకు మంది, విదేశీ విద్యా విదానంతో 162 మంది, ఎంఎస్ఎంఈ ద్వారా 2375 మంది లబ్ది పొందారని వివరించారు.

ఆరోగ్య ఆసరా, అమ్మ ఒడి

ఆరోగ్య ఆసరా, అమ్మ ఒడి

అమ్మ ఒడి కింద ఎస్టీలు 2 లక్షల 76 వేల పైచిలుకు మంది, ఆరోగ్య శ్రీ కింద 24 వేల పైచిలుకు మంది, ఆరోగ్య ఆసరా కింద 4 వేల 74 మంది, జగనన్న వసతి దీవెన కింద 53 వేల పైచిలుకు మంది, జగనన్న విద్యా దీవెన కింద 75 వేల పైచిలుకు మంది, విదేశీ విద్యా దీవెన 24 మంది, ఎంఎస్ఎంఈ కింద 248 మంది లబ్దిపొందారని విజయసాయిరెడ్డి తెలిపారు.

 జగనన్న చేదోడు పథకం, గోరు ముద్ద

జగనన్న చేదోడు పథకం, గోరు ముద్ద

జగనన్న చేదోడు పథకం కింద 18 వేల పైచిలుకు మంది ఎస్సీలు, 2 వేల 991 మంది ఎస్టీలు లబ్దిపొందారని పేర్కొన్నారు. జగనన్న గోరు ముద్ద కింద ఎస్సీలు 9 లక్షల 26 వేల పైచిలుకు.. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 4 లక్షల 82 వేల పైచిలుకు మంది, హౌస్ సైట్స్ 5 లక్షల 89 వేల మంది, వైఎస్ఆర్ చేయూత కింద 5 లక్షల 33 వేల మంది లబ్ది పొందారని తెలిపారు. కంటి వెలుగు కింద ఎస్సీలు 13 లక్షల 43 వేల పైచిలుకు మంది.. ఎస్టీలు 4 లక్షల 57 వేల మంది లబ్ది పొందారు.

87 లక్షల మంది ఎస్సీలు, 26 లక్షల మంది ఎస్టీలు..

87 లక్షల మంది ఎస్సీలు, 26 లక్షల మంది ఎస్టీలు..

జగనన్న గోరు ముద్ద పథకం కింద ఎస్టీలు 2 లక్షల 75 వేల పైచిలుకు మంది, సంపూర్ణ పోషణ కింద లక్ష 80 వేల మంది, హస్ సైట్స్ లక్ష 72 వేల పైచిలుకు మంది, చేయూత కింద లక్ష 34 వేల పైచిలుకు మంది లబ్ది పొందారని తెలిపారు. మొత్తంగా ఎస్సీలు 87 లక్షల 23 వేల 414 మంది, ఎస్టీలు 26 లక్షల 15 వేల 813 మంది లబ్ది పొందారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎస్సీలకు 9 వేల 986 కోట్లు, ఎస్టీలకు 3 వేల 71 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.

English summary
87 lakh sc, 26 lakh sts are eligible welfare schemes ysrcp mp vijaya sai reddy said. total 13 thousand crores are allocated to this schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X