వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో 9 కొత్త మండలాలు...ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎపిలో కొత్త మండలాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ అర్బన్ మండలాలను విభజించి, 9 కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నూతనంగా ఏర్పాటైన అర్బన్ మండలాల వివరాలు ఇవి...విజయవాడ అర్బన్ మండలాన్ని విజయవాడ (తూర్పు), విజయవాడ (సెంట్రల్), విజయవాడ (నార్త్), విజయవాడ (వెస్ట్) మండలాలుగా విభజించింది. విశాఖ అర్బన్, రూరల్ మండలాలను సీతమ్మధార, మహారాణిపేట, గోపాలపట్నం, ములగాడ, విశాఖ (రూరల్) మండలాలుగా, కర్నూల్ మండలాన్ని అర్బన్, రూరల్ మండలాలుగా, నెల్లూరు మండలాన్ని కూడా అర్బన్, రూరల్ మండలంగా, గుంటూరు మండలాన్ని గుంటూరు (ఈస్టు), గుంటూరు (వెస్టు)గా విభజించింది. డిసెంబర్ 16 న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మండలాల విభజన విషయమై నిర్ణయం తీసుకోగా తాజా ఉత్తర్వులతో నూతన మండలాలు కార్యరూపం దాల్చాయి.

9 New Mandals in AP

పాత మండలాల విభజన ఇలా...
రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విశాఖపట్నంలో అర్భన్, రూరల్ మండలాలు 2 ఉండగా వాటిని 5 మండలాలుగా విభజించారు. విజయవాడలో ఒక అర్బన్ మండలాన్ని 4 మండలాలుగా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు నగరాల్లో ఉన్న ఒక్కో అర్బన్ మండలాన్ని 2 గా విభజన చెయ్యడం జరిగింది.

English summary
The AP government has issued orders on 9 new urban mandals in the state.These 9 new urban mandals in major cities like Vishakhapatnam, Vijayawada, Guntur , kurnool, and nellore cities for administration convenience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X