9మంది అరెస్ట్: అరకిలో గోల్డ్, కారు, 3సెల్‌ఫోన్లు, ట్యాబ్ సీజ్(పిక్చర్స్)
విశాఖపట్నం: నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన 9మంది నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారినుంచి 389 గ్రాముల బంగారం, టొయాటో ఇటియోస్ కారు, టాటా మ్యాజిక్ వ్యాను, మూడు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కమిషనరేట్ సమావేశ మందిరంలో క్రైం డిసిపి ఎస్ వరదరాజు ఈ మేరకు వివరాలను మీడియాకు తెలిపారు. 4వ పట్టణ పిఎస్ పరిధిలో మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న గాజువాక వడ్లపూడికి చెందిన మిరియాల సతీష్‌కుమార్, మద్దిల పాలెంలోని వెంపాడవీధికి చెందిన మెహతా కనకరాజులు చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిద్దరు 2012 నుంచి 17 నేరాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 420 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
పనిచేస్తున్న యజమానికే శఠగోపం పెట్టిన పిఎంపాలెంలోని గాయత్రినగర్‌కు చెందిన దొమ్మేటి అశోక్‌కుమార్‌ను 4వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 15న నిందితుడు తన యజమాని శాంతిపురంలో నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చి కారుతో సహా పరారయ్యాడు. గురువారం ఉదయం నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో నలుగురు చైన్ స్నాచర్లతోపాటు ఇద్దరు దొంగలను కూడా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని నగర ఇంఛార్జ్ పోలీస్ కమిషనర్ అతుల్ సింగ్ తరపున క్రైం ఏడిసిపి వరదరాజు అభినందించారు.

సీజ్ చేసిన బంగారు ఆభరణాలు
నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన 9మంది నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

స్వాధీనం చేసుకున్న కారు
వారినుంచి 389 గ్రాముల బంగారం, టొయాటో ఇటియోస్ కారు, టాటా మ్యాజిక్ వ్యాను, మూడు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు వెల్లడిస్తూ..
కమిషనరేట్ సమావేశ మందిరంలో క్రైం డిసిపి ఎస్ వరదరాజు ఈ మేరకు వివరాలను మీడియాకు తెలిపారు.

వివరాలు వెల్లడిస్తూ..
నిందితులను పట్టుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని నగర ఇంఛార్జ్ పోలీస్ కమిషనర్ అతుల్ సింగ్ తరపున క్రైం ఏడిసిపి వరదరాజు అభినందించారు.












Click it and Unblock the Notifications