ఆకతాయి ఎంత పనిచేశాడు?: 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

జిల్లాలోని పెనమలూరు మండలం సనత్‌నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఆకతాయి వేదింపులతో 9వ తరగతి విద్యార్థిని కర్రి సౌమ్య ఆత్మహత్యకు పాల్పడింది.

కృష్ణా: జిల్లాలోని పెనమలూరు మండలం సనత్‌నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఆకతాయి వేదింపులతో 9వ తరగతి విద్యార్థిని కర్రి సౌమ్య ఆత్మహత్యకు పాల్పడింది. పటమట ప్రభుత్వ హైస్కూల్‌లో చదువుకుంటున్న సౌమ్యను గత 4రోజులుగా నాని అనే యువకుడు వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

సౌమ్య తండ్రి గోవిందరావు ఎలక్ట్రిషన్‌గా, తల్లి పార్వతి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నారు. బతుకుదెరువుకు ఐదేళ్ళ కిందట సనత్ నగర్‌కు వచ్చి ఇక్కడే నివాసం వుంటున్నారు.

 9th Class girl commits suicide due to sexual harassment

తల్లిదండ్రులు పనులకు వెళ్ళడంతో తన చెల్లెలు బుజ్జితో కలిసి సౌమ్య పటమట స్కూల్‌‌కు వెళ్ళేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, నాలుగురోజుల నుంచి నాని వేధింపులు ఎదురుకావడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో సౌమ్య.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

సౌమ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. సౌమ్య మృతికి కారణమైన నానిపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులతోపాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+