పిట్ట కొంచెం ఐక్యూ ఘనం: ఏపీలో 9 నెలల చిన్నారి అరుదైన ఘనత!!

పిల్లలలో ఉన్న ఐక్యూ ను గుర్తించి, సరిగ్గా తర్ఫీదును ఇస్తే చిన్నారులు అద్భుతాలు చేస్తారు అని చెప్పడానికి నిదర్శనం ఈ సంఘటన. వారికి ఉన్న శక్తిని గుర్తించి ఆ దిశగా వారిని తీర్చిదిద్దితే వారి భవిష్యత్ స్వర్ణమయం అవుతుందని చెప్పటానికి ఉదాహరణ ఈ ఉదంతం. చిన్నారిలో ఉన్న విశేషమైన ప్రతిభను గుర్తించి తర్ఫీదునిచ్చిన తల్లిదండ్రులు తొమ్మిది నెలల చిన్నారి సాధించిన ఘనతని చూసి సంబరపడుతున్నారు.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి ఇటువంటి ఘటనలు తార్కాణమని ఈ విషయం చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా రేబాక కు చెందిన తొమ్మిది నెలల చిన్నారి వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.

A 9-month-old baby in AP has recieved gold medal in World Wide International Book of Records

ఈ గ్రామానికి చెందిన వెంకట నారాయణ మూర్తి, తేజస్విని దంపతుల కుమార్తె అయిన లాస్విక ఆర్యకు జంతువులు, కూరగాయల బొమ్మలు చూపించి వాటిని గుర్తించడం లో ఆరు నెలల వయసు నుండే తల్లి శిక్షణ ఇచ్చింది. ఇక గుర్తించడం మొదలు పెట్టిన లాస్విక ఆర్య ప్రస్తుతం తొమ్మిది నెలల వయసు ఉంది. తొమ్మిది నెలల వయసులో ఆ చిన్నారి 3.36 నిమిషాలలో 11 రకాల కూరగాయల, జంతువుల బొమ్మలను గుర్తించింది.

దీంతో తల్లిదండ్రులు లాస్విక ఆర్య కూరగాయలను, జంతువుల బొమ్మలను గుర్తించిన వీడియోను మార్చి నెలలో వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు కు పంపించారు. వాటిని పరిశీలించిన నిర్వాహకులు లాస్విక ఆర్య ప్రతిభను గుర్తించి ఆమెను మెచ్చుకొని బంగారు పతకాన్ని, ప్రశంసాపత్రాలను మంగళవారం నాడు పంపించారు.

తొమ్మిది నెలల వయసులోనే వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ద్వారా ప్రశంసలు పొందిన లాస్విక ఆర్య ప్రతిభను గ్రామస్తులు కూడా మెచ్చుకుంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన 9 నెలల చిన్నారి లాస్విక ఆర్య భవిష్యత్ లో మరిన్ని విజయాలు సొంతం చేసుకుని, మరిన్ని రికార్డులు సాధించాలని స్థానికులు చిన్నారిని ఆశీర్వదిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+