వధువు గోరింటాకు పెట్టుకోలేదని పెళ్లే ఆపేసిన వరుడు

పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఎంఎస్ మక్తాకు చెందిన ఓ యువతి(23)కి, నగరంలోని ఉమర్ కాలనీకి చెందిన మీర్ మస్సూం అలీ(32)కి వివాహం కుదిరింది. అలీ సౌదీ అరేబియాలో ఏటిఎం సర్వీస్ ప్రొవైడర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి రోజు ముందు అమ్మాయిని పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేస్తారు.
ఇందుకోసం ఆ రోజు రాత్రి 9గంటలకు మగపెళ్లి వారు వధువు ఇంటికి రావాల్సి ఉంటుంది. వారు 12 గంటలకు వచ్చారు. వధువుకు గోరింటాకు పెట్టలేదేమిటంటూ వరుడు అలీ వచ్చిరాగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేగాక వధువు కుటుంబసభ్యుల ప్రతి పనిపై తన కోపాన్ని చూపించాడు.
చివరికి అసలు పెళ్లే వద్దంటూ భీష్మించుకున్నాడు. మూడు రోజులపాటు పలు రకాలుగా వరుడితో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితురాలి తండ్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications