Tirumala: తిరుమల నడక మార్గంలో మరోసారి సంచరించిన చిరుత.. ఆందోళనలో భక్తులు..
తిరుమల నడక మార్గంలో మరోసారి చిరుత సంచరించింది. అలిపిరి నడక మార్గంలో చిరుత కనిపించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం నామాల గవి వద్ద చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచిరించినట్లు రికార్డు అయింది. దీంతో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులు భద్రత చర్యలపై చర్చించారు. మరో వారంలో అలిపిరి నడకదారి భక్తులకు కర్రలు అందిస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు. చిరుతల కోసం ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని చెప్పారు.
చిరుతలను పట్టుకునే వరకు ఫారెస్ట్ అధికారులకు సహకరిస్తామని వివరించారు. ఆగస్ట్ 11 న రాత్రి గంటల ప్రాంతంలో రక్షిత అనే బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి తిరుమల కొండకు నడక మార్గంలో అరేళ్ల వయసున్ రక్షిత కనిపించకుండా పోయింది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు చిన్నారి కోసం వెతికారు. రక్షిత ఆగస్ట్ 12న విగత జీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. ఈ ఘటన తిరుమల సంచలనం సృష్టించింది.

అందుకు ముందు కూడా చిరుత ఓ బాలుడిపై దాడి చేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ చిరుత చేపట్టారు. ఇందులో భాగంగా నాలుగు చిరుతలను బంధించారు. ఇందులో బాలికపై ఏ చిరుత దాడి చేసిందో ఇంకా గుర్తించేలాదు. అయితే గతంలో అలిపిరి నడక మార్గంలో నాలుగు చిరుతలే కనింపించాయని.. వాటిని పట్టుకున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కానీ మరోసారి అక్కడ చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఈ చిరుతను పట్టుకోవడానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టారు.
నడక మార్గం వద్ద ఏర్పాటు చేసిన మూడు వందల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరిన్ని కెమెరాలు కూడా ఎర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తిరుమల నడక మార్గం లో ఎలుగుబండి కనిపించింది. ఆ తర్వాత కెమెరాల్లో ఎలుగుబంటి చిక్కలేదని.. అది అడవిలోకి వెళ్లిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications