విషాదం: కాలేజీ ల్యాబ్‌లో మహిళా లెక్చరర్ ఆత్మహత్య

A college lecturer allegedly commits suicide
ప్రకాశం: జిల్లాలోని అద్దంకిలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఎన్టీఆర్ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న అంజలిదేవి సోమవారం సాయంత్రం కళాశాల ల్యాబ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషయాన్ని మంగళవారం ఉదయం కళాశాల విద్యార్థులు, సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అంజలిదేవి సోమవారం సాయంత్రమే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాల తెలియరాలేదు. దర్యాప్తులో భాగంగా పోలీసులు.. ఆమె కుటుంబసభ్యులను, కళాశాల సిబ్బంది ప్రశ్నించారు. పోస్టుమార్టం నిమిత్తం అంజలిదేవి మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలితంచారు.

ఆటో ఢీకొని వ్యక్తి మృతి

ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మార్కాపురం మండలంలోని కొలభీమునిపాడు వద్ద సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కొలభీమునిపాడు గ్రామానికి చెందిన మాండ్లా అల్లూరయ్య(65) గ్రామం నుంచి ఎస్సీపాలెంకు వెళ్తున్నారు.

ఈ సందర్భంగా గొట్టిపడియ వైపు వెళ్లేందుకు వస్తోన్న ఆటో రహదారి దాటుతున్న అల్లూరయ్యను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అల్లూరయ్యను మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అల్లూరయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+