భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని సూసైడ్ యత్నం

ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. సంధ్యారాణి కరీంనగర్ జిల్లా కోరుట్లపేట గ్రామానికి చెందిన మల్లారెడ్డి కుమార్తె. హైదరాబాద్‌లోని దిల్ సుఖ్ నగర్ లోని వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబం ఆత్మహత్యాయత్నం: ముగ్గురి మృతి
మెదక్: జిల్లా కేంద్రంలోని వీరహనుమాన్ కాలనీలో విషాధ ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధతో మెదక్ మున్సిపాలిటీలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్యామల అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తన తల్లితోపాటు ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో శ్యామల తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ప్రాణాలతో బయటపడ్డ శ్యామల మెదక్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.
మొదటి శ్యామల తన ఇద్దరు పిల్లలు స్పందన, నందీష్‌లకు విషమిచ్చింది. ఆ తర్వాత శ్యామల, ఆమె తల్లి రాజమణిలు విషం తీసుకున్నారు. కడుపునొప్పి భరించలేక రాజమణి ఇంటి సమీపంలో ఉన్న మల్లెంచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శ్యామల ప్రాణాలతో బయటపడి మెదక్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శ్యామల సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications