నకిలీ ఎస్పీగా మారిన టెక్కీ: పోలీసులను వాడేసుకుని దొరికిపోయాడు
తూర్పుగోదావరి: ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఏకంగా గ్రేహౌండ్స్ ఎస్పీ అవతారమెత్తాడు. తాను ఎస్పీనంటూ పోలీసుల శాఖలో కింది స్థాయి నుంచి సిఐ, ఎస్ఐ వరకు అందరినీ వాడేసుకున్నాడు. ఎట్టకేలకు అతని వ్యవహారం బట్టయలుకావడంతో కటకటాలపాలయ్యాడు. అతడే హైదరాబాద్‌లోని మల్కాజిగిరికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కార్తికేయ.
వివరాల్లోకి వెళితే.. డిజిపి ఆఫీసులో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టలేషన్స్ చేసే ఉద్యోగి చేరాడు కార్తికేయ. అక్కడి గుట్టుమట్లు తెలుసుకుని నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా మలికిపురం ఎస్సై కె.విజయబాబుకు ఫోన్ చేసి తాను గ్రేహౌండ్స్ ఎస్పీని మాట్లాడుతున్నానని చెప్పాడు. తన స్నేహితులతో కలిసి దిండి రిసార్ట్స్‌కు వస్తున్నానని చెప్పాడు.
ఆ మాటలను నమ్మేసిన ఎస్సై శనివారం ఉదయం దిండి వంతెన వద్దకు వెళ్లి కార్తికేయ వచ్చిన మ్యాక్సీ పోలీస్ క్యాబ్‌ను రిసీవ్ చేసుకున్నారు. నకిలీ ఎస్పీకి సాదరంగా స్వాగతం పలికిన ఎస్సై విజయబాబు.. ‘‘సార్ గన్‌మన్లు రాలేదా'' అని అడగ్గా.. తాను పూర్వపు స్నేహితులతో వచ్చానని, ప్రైవేటు టూరుకు గన్‌మన్లు వాడటం సరికాదు కదా అని అన్నాడు. ‘కోనసీమ వంటి ప్రశాంత వాతావరణంలో నాకు భయమేమిటి' అని కూడా కోతలు కోశాడు.
‘సార్ వెపన్ ఏమైనా ఉందా?' అని అడగ్గా.. ‘జాగ్రత్త చేశానులే' అని చెప్పినట్టు తెలిపారు. పైగా తాను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా వస్తున్నానని, అందరికీ మంచి చేస్తానని భరోసా కూడా ఇచ్చాడు. ఇక పోలీసులు.. దిండిలో వీరికి ప్రైవేటు అతిథిగృహంలో నాలుగు గదులు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక సూట్ ప్రత్యేకంగా కార్తికేయకు ఏర్పాటు చేశారు.
కార్తికేయతోపాటు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్, మరో ఎనిమిది మంది రాగా, అందరికీ శనివారం ఉదయం నుంచి రాచమర్యాదలు చేశారు. దిండిలో బోట్ షికారు, ఏపీ టూరిజంలో విందు ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి చూశారు. ఆదివారం ఉదయం దాకా వారికి అంతా అనుకూలంగానే జరిగింది. కానీ.. ఆదివారం ఉదయం దిండి రిసార్ట్స్ మేనేజర్ రమేష్ కార్తికేయ బృందాన్ని చూడటంతో అతడి గుట్టు బయటపడింది.

రమేష్ అంతకుముందు పాడేరు రిసార్ట్స్‌లో పనిచేసిన నేపథ్యంలో.. నర్సీపట్నం ఎస్పీగా పనిచేసిన కార్తికేయతో అతడికి పరిచయం ఉంది. దీంతో అతడు.. దిండికి వచ్చిన కార్తికేయ అసలు ఎస్పీ కాదని గుర్తించి.. ఎస్సై విజయవాబును అప్రమత్తం చేశారు. దీంతో ఆయన కార్తికేయ వద్దకు వెళ్లి.. ‘మీరు ఎవరి వద్ద నుంచి ఛార్జీ తీసుకున్నారు సార్'' అని అడగ్గా.. ‘మీ వద్ద పనిచేసిన అడిషనల్ ఎస్పీ దామోదర్‌కు ఛార్జీ నేనే అప్పగించా'' అని చెప్పాడు.
ఎస్సై వెంటనే దామోదర్‌కు ఫోన్ చేసి.. మాట్లాడాల్సిందిగా కోరారు. ఫోన్ అందుకున్న కార్తికేయ.. దామోదర్‌ను ఏకవచనంతో సంబోధించాడు. దీంతో కార్తికేయ ఫొటో వాట్సప్‌లో పంపాల్సిందిగా దామోదర్ కోరారు. ఫొటోలో ఉన్నది కార్తికేయ కాదని, అతడెవరో తనకూ తెలియదని ఎస్పీ స్పష్టం చేశారు. వెంటనే ఎస్సై కార్తికేయ బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇది ఇలా ఉండగా, నకిలీ ఎస్పీ కార్తికేయను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తానొక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని చెప్పాడు. ఎంటెక్ చదివి నెలకు రూ.2.1 లక్షల జీతం తీసుకునేవాడినని, మైక్రోసాప్ట్ కంపెనీలో పనిచేసేటప్పుడు హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో ఎనిమిది నెలలపాటు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేశానని తెలిపాడు. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారుల వివరాలను తెలుసుకుని ఇలా మోసం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
కాగా, నకిలీ ఎస్పీ గురించి అమలాపురం డీఎస్పీ అంకయ్య వివరించారు. కార్తికేయపై రిసార్ట్స్ మేనేజర్ రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు శామన్నారు. కార్తికేయతోపాటు అతనివెంట ఉన్న రాజేంద్రప్రసాద్, బాలనరసింహ, వికాస్ కుమార్, ఆర్.సతీష్ కుమార్, ప్రతాప్ సింహా, విజయ్‌కుమార్, మసాజ్, మురళి, వాహన డ్రైవర్ ఉప్పలయ్యలను అదుపులోకి తీసుకున్నామన్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications