• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆటో నుంచి జారిన రేకు...తెగిపడిన మనిషి తల...అనంతపురంలో ఘోరం...

|

అనంతపురం: ఒక ఆటోడ్రైవర్ అంతు లేని నిర్లక్ష్యం ఘోరమరణానికి కారణమైంది...నిండు ప్రాణాన్ని దారుణంగా బలిగొంది. ఆటో మీద రేకు జారి ఎదురుగా బైక్ మీద వస్తున్న వ్యక్తి తల తెగిపడిన ఈ ఘటన వింటుంటేనే ఒళ్లు జలదరించేలా ఉండగా ప్రత్యక్ష సాక్షులకైతే గుండెలదిరిపోయాయి.

A farmer neck then his head cut and collapsed.

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మొగలాయిపల్లికి చెందిన రైతు నారాయణరెడ్డి (50) బుధవారం పని నిమిత్తం బుక్కపట్నం వచ్చాడు. తిరుగు ప్రయాణంలో చెరువుకట్ట మీదుగా ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు. ఇదే సమయంలో కొత్తచెరువు నుంచి బుక్కపట్నానికి ఇనుప రేకును టాపుపై వేసుకుని ఒక ఆటో వస్తోంది. నడిమిగుట్ట మలుపు వద్దకు రాగానే టాపుపై ఉన్న రేకు జారి ముందుకు దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న నారాయణరెడ్డి మెడను తెంచుకుంటూ కిందపడింది. తల వేరైన నారాయణ రెడ్డి శరీరం క్షణాల వ్యవధిలో గిలగిలకొట్టుకుంటూ నిర్జీవంగా మారిపోయింది. ఆటో టాపుపై రేకును కట్టకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారకుడైన ఆటో డ్రైవర్‌ పారిపోయినట్లు తెలిసింది.

English summary
A farmer Narayana Reddy (50) from Anantapur district came to bukkapatnam for his work Wednesday. After his work he returned to his village on a two-wheeler. At the same time, an auto is coming from oposite side with iron sheet on top. Suddenly the iron sheet was slipped from auto, touched Narayana Reddy neck then his head cut and collapsed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X