చంద్రబాబు పాలన ఇతివృత్తంతో సినిమా: పేరెంటో తెలుసా?

Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాలన ఇతివృత్తంగా ఓ సినిమా తెరకెక్కనుంది. వచ్చే నెల 4వ తేదీన ఈ చిత్రం షూటింగ్ ఒంగోలులో ప్రారంభం కానుంది.

'చంద్రోదయం' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విజయవాడ కార్పోరేటర్‌ కాకమాను మల్లిఖార్జున యాదవ్‌ నిర్మిస్తుండగా.. ఒంగోలుకు చెందిన పసుపులేటి వెంకటరమణ కథ, దర్శకత్వం వహించనున్నారు. ఆగస్టు 4న ఒంగోలులో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప షూటింగ్‌ ప్రారంభించనున్నారు.

A film based on CM Chandrababu Naidu's administration

పుష్కర ఏర్పాట్లపై అసంతృప్తి: కాంట్రాక్టర్లపై చంద్రబాబు ఆగ్రహం

విజయవాడ: కృష్ణా జిల్లా సీతానగరంలో పుష్కర పనులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కరఘాట్లు, ఇతర పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సకాలంలో పూర్తి కాకపోవడంపై సంజాయిషీ ఇవ్వాలని గుత్తేదారును హెచ్చరించారు.

అవసరమైతే గుత్తేదారును తప్పించి మరొకరికి పనులు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులు, కాంట్రాక్ట‌ర్ల‌తో ఆయ‌న చ‌ర్చించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

పుష్క‌రాల‌కు మ‌రో 20 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంద‌ని, అయినా ఇంకా ప‌నులు మంద‌కొడిగా జ‌రుగుతున్నాయ‌ని చంద్రబాబు అన్నారు. పనులు నిర్ణయించిన కాల వ్యవధిలోపు పూర్తి కాకపోవడంపై స‌మాధానం ఇవ్వాల‌ని ఆయ‌న చెప్పారు. నిర్లక్ష్యంగా పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It said that a film will be made based on CM Chandrababu Naidu's administration.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి