ఒంటరి బాలికపై లైంగిక దాడి: ఆస్పత్రిలో బాలుడి అపహరణ
విశాఖపట్నం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాయకరావుపేట మండలం నందవరం గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు లేని ఆ బాలిక గ్రామంలోని తన మేనమామ సంరక్షణలో ఉంటోంది.
కాగా, మంగళవారం రాత్రి ఆ బాలిక సమీపంలోని కిరాణ దుకాణానికి వెళ్తుండగా కోన రమణ అనే వ్యక్తి బలవంతంగా తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా ఏడవడంతో వదిలిపెట్టాడు. దీనిపై బాధితురాలి మేనమామ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రమణను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నక్కపల్లి మండలం సీతంపాలెంలో ఓ బాలికపై రమణ లైంగిక దాడికి పాల్పడ్డినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు ఆసుపత్రిలో బాలుడి అపహరణ
గుంటూరు: ప్రభుత్వ ఆస్పత్రిలో తొమ్మిది నెలల బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పసర్లపూడికి చెందిన ఏసుబాబుకు వైద్యం చేయించేందుకు మంగళవారం అతని అమ్మమ్మ దగ్గుబాటా హుసేనమ్మ ఆస్పత్రికి తీసుకొచ్చి పిల్లల వార్డులో చేర్పించింది.
బుధవారం ఉదయం అల్పాహారం తీసుకొచ్చేందుకు బయటికి వెళ్తూ... తన మనవడిని చూస్తూ ఉండమని మరో మహిళకు అప్పగించి బయటకు వెళ్లింది. తిరిగొచ్చే సరికి ఆ మహిళ, తన మనవడు కనిపించకపోవడంతో కన్నీటి పర్యంతమైంది.
వెంటనే ఆస్పత్రిలోని ఔట్‌పోస్టు పోలీసులకు, ఆస్పత్రి సూరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల్లోని దృశ్యాల సాయంతో మహిళ ఆచూకీకోసం ఆస్పత్రి వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఉదంతంపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications