హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిడ్నీ అమ్మకానికి పెట్టి.. రూ. 3 కోట్లకు ఆశపడి రూ. 16 లక్షలు పోగొట్టుకున్న యువతి, తండ్రికి బాధ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కిడ్నీ రాకెట్ వలలో పడి ఓ యువతి ఏకంగా రూ. 16 లక్షలు పోగొట్టుకుంది. మూడు కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆశ చూపి.. రూ. 16 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకుున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రూ. 3 కోట్లకు ఆశపడితే.. రూ. 16 లక్షలు కాజేశారు

రూ. 3 కోట్లకు ఆశపడితే.. రూ. 16 లక్షలు కాజేశారు

గుంటూరు జిల్లాకు చెందిన బాధిత యువతి.. హైదరాబాద్‌లో నర్సింగ్ చేస్తోంది. తన అవసరాల కోసం తండ్రి ఏటీఎం కార్డులో నుంచి రూ. 2 లక్షలు వాడుకుంది. వీటిని తిరిగి చెల్లించడానికి ఏకంగా తన కిడ్నీని అమ్మేందుకు సిద్ధపడింది. ఇందుకోసం పలు వెబ్‌సైట్లు చూసి.. ఆన్‌లైన్‌లో కనిపించిన ఫోన్ నెంబర్‌కు మెసేజ్ చేసింది. కాల్ చేసింది.

యువతి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. రూ. 3 కోట్లు ఇస్తామంటూ ఆశ చూపారు. పన్నుల పేరిట పలు దఫాలుగా రూ. 16 లక్షలు కాజేశారు. తీరా అదంతా మోసమని గ్రహించిన ఆ యువతి తండ్రితో కలిసి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

యువతిని నమ్మించిన కిడ్నీ రాకెట్ ముఠా

యువతిని నమ్మించిన కిడ్నీ రాకెట్ ముఠా


బాధిత యువతి మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా ఏదైనా ఆస్పత్రిలో తన కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించానని తెలిపింది. తనతో డాక్టర్ ప్రవీణ్ రాజ్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పింది. మొత్తం ఏడు కోట్లు ఇస్తామని.. మొదట రూ. 3 కోట్లు ఇస్తామని తెలిపింది. తాను కూడా నిజమే అని నమ్మినట్లు తెలిపింది. మొదట రూ. 10వేలు జమ చేశారని.. దీంతో నిజమేనని అనుకున్నట్లు తెలిపింది. తనను పూర్తిగా నమ్మించారని తెలిపింది.

డబ్బు తిరిగిస్తామంటే ఢిల్లీకి వెళ్లిన యువతి, కానీ..

డబ్బు తిరిగిస్తామంటే ఢిల్లీకి వెళ్లిన యువతి, కానీ..


ఆన్ లైన్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో రూ. 3 కోట్లు వేశారు. నిజమే అనుకున్నా. ఆ మొత్తం రావాలంటే పన్నులు, ఇతరత్రాలు చెల్లించాలని ఇందుకోసం రూ. 16 లక్షలు చెల్లించాలని చెప్పడంతో తాను పలుమార్లు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు బాధిత యువతి తెలిపింది. ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేసినట్లు తెలిపింది. చెన్నై సిటీ బ్యాంక్ పేరిట ఆ ఖాతాలున్నాయని చెప్పింది. ఇప్పుడు మళ్లీ రూ. 1.50 లక్షలు చెల్లించాలని కోరారని తెలిపింది. అయితే, అనుమానం వచ్చిన తన డబ్బులు తనకివ్వాలని వారిని కోరినట్లు చెప్పింది. అయితే, వారు ఢిల్లీకి రమ్మన్నారని.. అక్కడికి వెళితే.. ఎవరూ లేరని చెప్పింది. ఇంట్లో కూడా ఈ విషయం గురించి చెప్పలేదని బాధిత యువతి తెలిపింది.

తండ్రికి చెప్పకుండా యువతి.. పోలీసుల ఎంట్రీతో..

తండ్రికి చెప్పకుండా యువతి.. పోలీసుల ఎంట్రీతో..

బాధిత యువతి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన అమ్మాయి తన ఖాతాను ఉపయోగించిందని చెప్పారు. తన ఫోన్ అమ్మాయి దగ్గరే ఉండటంతో డబ్బు పోయిన విషయం తనకు తెలియలేదని తెలిపారు. బ్యాంక్ దగ్దరికి వెళితే.. తన ఖాతాలో నగదు లేదని తెలిసిందన్నారు. మోసపోయిన విషయం తనకు చెప్పకుండా తన కూతురు స్నేహితుల ఇంట్లో దాక్కుందని చెప్పారు. చివరకు పోలీసులే ఆచూకీ కనుక్కుని తమకు అప్పగించారని తెలిపారు. ఆ తర్వాత రూ. 16.40 లక్షలు పోగొట్టుకున్న విషయం చెప్పిందన్నారు. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇలాంటి మోసగాళ్ల బారినపడి డబ్బును పోగొట్టుకోవాదని ఎస్పీ సూచించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

English summary
A kidney racket gang looted Rs 16 lakhs from a nursing girl in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X