ప్రేమించుకొన్నారు,పెళ్ళై పది నెలలు, సెల్పీ తీసుకొని వివాహిత ఇలా..కారణమదేనా

పెళ్ళై ఏడాది కూడ కాలేదు. కాని, మనస్థాపానికి గురైన వివాహిత ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్య చేసుకొనేముందు సెల్పీ తీసుకొంది. ఈ ఘటన రాజమండ్రిలో చోటచేసుకొంది.

రాజమండ్రి: ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు. అయితే వివాహం చేసుకొన్న తర్వాత భార్యను భర్త తన ఇంటికి తీసుకెళ్ళలేదు. ఆమెపై అనుమానం పెంచుకొన్నాడు. అయితే ఈ బాధలు భరించలేక వివాహిత ఆత్మహత్యచేసుకొంది. ఆత్మహత్య చేసుకొనే ముందు ఆమె సెల్పీ తీసుకొంది.. ఈ సెల్పీ ఆధారంగా పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పట్టణంలోని శాంతి నగర్ కు చెందిన సోమిరెడ్డి ఆశోక్ అదే ప్రాంతానికి చెందిన మౌనిక ప్రేమించుకొన్నారు.

వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారు. దీంతో గత ఏడాది ఏప్రిల్ మాసంలో ఆశోక్ ,మౌనికల వివాహమైంది.అయితే మౌనికను ఆశోక్ తన ఇంటికి తీసుకెళ్ళేవాడు కాదు. ఎప్పుడైనా తీసుకెళ్ళినా వెంటనే తీసుకొచ్చి ఆమెను పుట్టింట్లోనే వదిలేసేవాడు.

తొమ్మిది మాసాల నుండి తన భార్యను ఆశోక్ తీసుకెళ్ళలేదు.ఈ విషయమై ఆశోక్ ను మౌనిక కుటుంబసభ్యులు ప్రశ్నించినా త్వరలోనే తీసుకెళ్తానని చెప్పేవాడని మౌనిక కుటుంబసభ్యులు చెప్పారు.

తన భర్తకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆమె సెల్పీలో తన బాధలను చెప్పింది .మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొంటున్నట్టు ఆమె ప్రకటించింది.

sucide selfi

ఈ ఘటన సోమవారం నాడు జరిగింది.ఈ సెల్ ఫోన్ లో ఆమె తన సెల్పీ ని మౌనిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే అత్తింటి వారి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకొందని మౌనిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కట్నం కింద ఒప్పుకొన్నడబ్బులను ఇంకా కొన్ని చెల్లించాల్సి ఉందని మౌనిక తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఎప్పుడూ కూడ అనుమానం వచ్చేలా ప్రవర్తించలేదని వారు చెప్పారు. మౌనిక భర్త ఆశోక్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+