కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు, అబార్షన్ చేయించాడు, కానిస్టేబుల్ పై భార్య సంచలనం

ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు ఓ కానిస్టేబుల్. అయితే ఈ వివాహం చేసుకొనే సమయానికే ఆయనకు వివాహమైంది. ఈ విషయాన్ని దాచిపెట్టి ఆయన రెండో వివాహం చేసుకొన్నాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప:ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు,అయితే అప్పటికే అతనికి వివాహమైంది. తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ పరిహరం ఇస్తా వెళ్ళిపోవాలంటూ ఓ కానిస్టేబుల్ తనను మోసం చేశాడని ఓ బాధితురాలు ఆవేదనచెందుతోంది. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసు ఉన్నతాధికారులను కోరుతోంది.

కడప జిల్లాలోని కమలాపురం మండలకేంద్రంలోని రామ్ నగర్ కు చెందిన ఓ వివాహిత తనను కానిస్టేబుల్ ప్రేమించి వివాహం చేసుకొని ప్రస్తుతం వదిలించుకోవాలని చూస్తున్నాడని ఆరోపిస్తోంది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.

2012 లోని కమలాపురంలోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివే సమయంలో అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ తన స్నేహితురాలి ద్వారా పరిచయమయ్యాడని చెప్పింది.

A Lady complaint against constable in kadapa

అయితే కానిస్టేబుల్ తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని పెళ్ళి చేసుకోవాలని కోరాడని ఆమె వివరించారు. ఈ మేరకు 2015 లో కడపలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో తనను కానిస్టేబుల్ వివాహం చేసుకొన్నాడని బాధితురాలు చెప్పింది. అయితే ఈ వివాహనికి కానిస్టుబుల్ కుటుంబసభ్యులు ఎవరూ కూడ హజరుకాలేదు. ఈ విషయమై ప్రశ్నిస్తే ఈ వివాహనికి తమ కుటుంబసభ్యులకు ఇష్టం లేదని ఆయన చెప్పాడన్నారు.

కొంత కాలంపాటు తనతో కాపురం చేశాక తనకు ఇదివరకే వివాహమైందని అయితే తన మొదటి భార్య అంటే తనకు ఇష్టం లేదని చెబితే తాను ఆశ్చర్యపోయాయని ఆమె చెప్పారు. అయితే తాను అప్పటికే గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడని ఆమె చెప్పారు.

అబార్షన్ చేయించడంతో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు చెప్పారు.ప్రస్తుతం అతను దువ్వూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడని బాధితురాలు చెబుతోంది. నీ వద్దకు రాలేదను. నా తల్లి దండ్రులు రెండో వివాహన్ని ఒప్పుకోవడం లేదంటూ తనకు చెబుతున్నారని బాధితురాలు వాపోయారు.

తన తల్లిదండ్రులు వచ్చి నీకు ఇచ్చింది తీసుకొని మిన్నకుండాలని కోరుతున్నారని బాధతురాలు చెప్పారు.అయితే ఈ విషయాన్ని జిల్లా ఎస్ పి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా బాధితురాలు చెప్పారు.అయితే తనకు దువ్వూరు పోలీసులు ఎలాంటి న్యాయం చేయలేదని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.

English summary
A Lady complaint against constable in kadapa.constable cheated a lady. she has complaint against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X