పని ఒత్తిడితో టెక్కీ ఆత్మహత్య: వ్యభిచార గృహంపై దాడి

కాగా, మంగళవారం హాస్టల్‌లో అందరూ తమ విధుల నిమిత్తం బయటికి వెళ్లిపోగా సాయివైష్ణవి తన గదిలోనే ఉండిపోయింది. పనిమనిషి సాయంత్రం ఆమె గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా సాయివైష్ణవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో హాస్టల్ సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గదిలో సాయివైష్ణవి రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తాను పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సాయివైష్ణవి తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. తనకు అన్ని అర్హతలున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని నోట్‌లో ఆమె రాసింది. ఆ తర్వాత సాయివైష్ణవి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి: నలుగురు అరెస్ట్
వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో సరూర్‌నగర్ పోలీసులు హుడా కాంప్లెక్స్, రాజరాజేశ్వరి అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌పై మంగళవారం దాడి చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకుడితోపాటు ఓ విటుడు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యభిచార గృహం నిర్వాహకుడు రాజేష్‌తోపాటు ఇద్దరు యువతులు, ఒక విటుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications