TTD: కాలి నడక మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్..!!
Tirumala: తిరుమలలో నడకమార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. ఈ మధ్య కాలంలో తరచూ చిరుతల సంచారంతో టీటీడీ అప్రమత్తం అయింది. తాజాగా నడకమార్గంలో గాలి గోపురం వద్ద తెల్లవారు జాము వేళ చిరుత సంచారం సీసీ కెమేరాల్లో రికార్డు అయింది. రాత్రి జూ పార్క్ మార్గంలో సంచరించిన చిరుత.. ఆ తరువాత మెట్ల మార్గంలో కనిపించటంతో తాజాగా అటవీ శాఖ అధికారులు వెంటనే టీటీడీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో, టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది.
తిరుమల నడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. సోమవారం రాత్రి తిరుపతిలోని జూ పార్క్ రోడ్ లో చిరుత సంచారం గుర్తించారు. సోమవారం అర్ద్రరాతి అలిపిరి కాలిబాట మార్గంలో గాలి గోపురం వద్ద చిరుత సంచరించినట్లు సీసీ కెమేరాల్లో కనిపించ టంతో వెంటనే స్థానిక దుకాణ దారులు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వెంటనే టీటీడీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఈ రెండు ప్రాంతాల్లో గుర్తించిన చిరుతలు ఒక్కటేనా.. వేర్వేరా అనేది అధికారులు తేల్చే పనిలో ఉన్నారు. కాలి నడక మార్గంలో గతంలో ఒక బాలుడు గాడ పడటం.. ఒక బాలిక ప్రాణాలు కోల్పోవటంతో టీటీడీ అప్పటి నుంచి చిరుతల సంచారం పైన ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

చిరుత సంచారంతో టీటీడీ భక్తులను తాజా అప్రమత్తం చేసింది. మధ్యాహ్నం రెండు గంటల వరకే 12 ఏళ్ల లోపు పిల్లలను నడక మార్గంలో అనుమతించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం అనంతరం భక్తులు గుంపులుగా నడక మార్గంలో వెళ్లాలని స్పష్టం చేసారు. తిరుమల ఘాట్ రోడ్డులో వన్య మృగాల కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసారు.
ప్రత్యేకంగా వీటి కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి కాలిబాట, ఘాట్ రోడ్డుల్లో చిరుత పులి సంచారం కలవర పెడుతోంది. కాగా, టీటీడీ మాత్రం భక్తుల కు ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇస్తోంది. కాగా, టీటీడీ సూచనలు మాత్రం అమలు చేయాలని సూచించింది.












Click it and Unblock the Notifications