బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాలకు ముంచుకొస్తోంది..!!
తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడ్దాయి. రెండు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల్లో కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఆవర్తన ప్రభావం ఏర్పడింది. మరో వైపు బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. ఫలితంగా రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అల్ప పీడనం
ఈనెల 27న పశ్చిమ మధ్య, సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అటు అరేబియాలో ద్రోణి తోడు కావటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని అదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది.

అరేబియా సముద్రంలో
తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులు తూ శుక్రవారం సాయంత్రానికి (రాబోయే 36 గంటల్లో) వాయుగుండంగా బలపడే అవకాశముంద ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈనెల 27వ తేదీ నాటికి పశ్చిమమధ్య బంగా ళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తరువాత రెండు రోజుల్లో బలపడి తుఫాను గా మారే అవకాశం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్లూరి సీతారా మరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతలు
ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నల్లగొండ లో 35.5, మహ బూబ్ నగర్ లో 30.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం (మే 22) నల్లగొండ, ఖమ్మం, రామగుండంలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 24వ తేదీ అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, నెల్లూరు, శ్రీసత్యసాయి, తిరు పతి, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications