అసభ్య మెసేజ్‌లు: బాధితుల్లో మాజీ ఎమ్మెల్యే కూతురు

ఎంబిఏ విద్యనభ్యసించిన లక్ష్మణ్, కాల్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తూనే పార్ట్ టైమ్ జాబ్‌గా పగలు పిజ్జా డెలివరీ బాయ్‌గా కూడా విధులు నిర్వహించేవాడు. ఈ విధంగా ధనవంతులైన అమ్మాయిల ఫోన్ నెంబర్లను తెలుసుకొని పరిచయాలు పెంచుకునేవాడు. తర్వాత అదే చనువుతో వారికి అసభ్య సందేశాలను పంపిస్తూ వేధింపులకు గురిచేశాడు.
మాజీ ఎమ్మెల్యే కూతురుతోపాటు సుమారు మందికి పైగా అమ్మాయిలను వేధింపులకు గురి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు నిందితుడు లక్ష్మణ్‌ను నల్గొండ జిల్లాలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితునికి వివాహం కూడా అయినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మరో ఘటనలో జూబ్లీహిల్స్‌లోని మసాజ్ సెంటర్‌పై నగర పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్‌లోని పలువుర్ని అరెస్ట్ చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో తల్లీ, కొడుకు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తల్లీ తన ఇద్దరు పిల్లలతోపాటు ఆత్మహత్యకు పాల్పడింది. తల్లీ, కొడుకు మృతి చెందగా... కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లాలోని పెనుకొండ మండలం కొండంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications