పెళ్లి కూతుర్ని ప్రేమించానని హంగామా: చితక్కొట్టారు
చిత్తూరు: కొద్ది గంటల్లో వివాహం జరుగుతుందనగా వచ్చిన ఓ వ్యక్తి తాను పెళ్లి కూతుర్ని ప్రేమించానని.. ఈ పెళ్లి జరగడానికి వీళ్లేదని చాలా హంగామా సృష్టించాడు. దీంతో ఆగ్రహానికి గురైన పెళ్లి కూతురు బంధువులు ఆ యువకుడ్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ప్రస్తుతం వివాహం జరుగుతున్న యువతిని ప్రేమించాడు. అయితే ఆమె తల్లిదండ్రులు ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. వివాహాన్ని తిరుపతిలో జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

కాగా, ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ వివాహం జరుగుతున్న తిరుపతి పరకాల మఠంలోని కళ్యాణ వేదికకు చేరుకుని పెళ్లిన ఆపాలని ప్రయత్నించాడు. మహాలక్ష్మిని ప్రేమించానని, ఈ పెళ్లి ఆపాలని నానా హంగామా సృష్టించాడు. దీంతో ఆగ్రహానికి గురైన వధువు కుటుంబ సభ్యులు, బంధువులు అతడ్ని చితకబాదారు. అనంతరం అక్కడ్నుంచి పంపించేశారు.
వెంకటేష్ తనను పెళ్లి చేసుకోవాలని మహాలక్ష్మిని వేధింపులకు గురి చేసేవాడని వధువు తరపు బంధువులు చెప్పారు. అతనికి గతంలోనే వివాహం జరిగిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ఇది ఇలా ఉండగా తామిద్దరం నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేయాలని కోరితే తనపై దాడికి పాల్పడ్డారని వెంకటేష్ ఆరోపించాడు.












Click it and Unblock the Notifications