విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూతురుని తనకివ్వలేదని.. మేనత్త చేతులు నరికాడు

|
Google Oneindia TeluguNews

A man allegedly cuts his aunt's hands
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం కాపురాళ్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మరదలిని తనకిచ్చి వివాహం చేసేందుకు మేనత్త అంగీకరించలేదనే కోపంతో.. మేనల్లుడు ఆమె చేతులను నరికాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు.

తీవ్ర రక్తస్రావం జరుగుతుండటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మహిళపై దాడి: ముగ్గురి అరెస్ట్

మర్రిపాడు మండలంలోని నందవరం గ్రామంలో మహిళపై దాడి చేసిన ముగ్గురిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ విజయ్‌శ్రీనివాస్‌ తెలిపారు. ఇటీవల గ్రామానికి చెందిన సయ్యద్‌ జైబున్సీసా పక్కింటి రేకుల పైనుంచి వర్షపునీరు తన ఇంట్లోకి చేరుతుందని ప్రశ్నించినందుకు ఆమెపై అదే గ్రామానికి చెందిన రంతుల్లా, తాజ్‌, రహమత్‌బాషాలు దాడి చేశారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో విచారించి వారిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇది ఇలా ఉండగా మర్రిపాడు మండలంలోని చాబోలు పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన నలుగురు ఎర్రచందనం కూలీలను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ విజయ్‌శ్రీనివాస్‌ తెలిపారు. గ్రామానికి చెందిన నల్లిపోగు ప్రసాద్‌, మంచాల రమణయ్య, మంచాల నాగయ్య, మంచాల రమణయ్యలు గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం కూలీలుగా పని చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని ఎస్‌ఐ పేర్కొన్నారు.

పేలని తుపాకి....నిందితుడు పరారీ

విశాఖపట్నం: పాతకక్షల నేపథ్యంలో బుధవారం రాత్రి విశాఖ జిల్లా అనకాపల్లిలో ఒక యువకుడు తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. తన శత్రువును కాల్చేందుకు యత్నించి విఫలం కావడంతో పరారయ్యాడు. గవరపాలెం సతకంపట్టు జంక్షన్‌కు చెందిన దాడి కృష్ణ, సంతోషిమాత ఆలయ ప్రాంతానికి చెందిన కర్రి రాజేష్‌ మధ్య గొడవలు వున్నాయి. టీ దుకాణం వద్ద కృష్ణ కూర్చుని వుండగా అతడ్ని తుపాకీతో కాల్చేందుకు రాజేష్‌ యత్నించాడు. అది పేలకపోవడంతో భయపడి పరారయ్యాడని బాధితుడు తెలిపాడు.

English summary
A man allegedly chopped his aunt's hands in Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X