సినిమాల ఎఫెక్టే: పగలు కూలీ! రాత్రి దోపీడీలు: మూడు హత్యల సైకో కిల్లర్ ఇతడే

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: నిత్యం రద్దీగా ఉండే చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో దోపిడీకి పాల్పడి ఓ మహిళను దారుణంగా హత్యచేసిన హంతకుడు వెంకటేశ్వర్లు ఘరానా నేరగాడు అని పోలీసులు గుర్తించారు. శనివారం మధ్యాహ్నం నెల్లూరు నగరంలోని చిల్డ్రన్ పార్క్ సమీపంలో ఒకే కుటుంబంలోని ముగ్గురిపై వెంకటేశ్వర్లు దాడి చేయటంతో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.

పట్టపగలు దొంగల బీభత్సం: ముగ్గురి గొంత కోశారు, ఒకరి మృతి

కాగా, గతంలో కావలి, పెద్దచెరుకూరులలో మూడు హత్యలు చేసింది ఈ సైకో కిల్లరే అని పోలీసుల విచారణలో తేలింది. జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపిన వివరాలు ప్రకారం.. దోపిడీ దొంగ వెంకటేశ్‌.. సాయినగర్‌లోని ఓ ఇంట్లో ప్రవేశించి ఇంటి యజమానురాలు ప్రభావతి(55), వారి పిల్లలైన మాధురి, అనంత కృష్ణలపై దాడి చేసి సుత్తితో తలపై మోదాడు.

A man allegedly killed a woman

ఈ దాడిలో ముగ్గురూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే దుండగుడు వారి వద్ద ఉన్న బంగారు నగలను, సెల్‌ఫోన్లను చోరీ చేస్తుండగా ఇంటి యజమాని నాగేశ్వరరావు వచ్చారు. రక్తపు మడుగులో ఉన్న భార్య ప్రభావతిని, పిల్లలను చూసి వారి దగ్గరకు వెళ్తుండగా దుండగుడు ఆయనపై కూడా దాడి చేయబోయాడు.

నాగేశ్వరరావు అప్రమత్తమై దుండగుడిని పట్టుకొని కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్న వాళ్లు వచ్చి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. గాయపడిన ప్రభావతి చికిత్స పొందుతూ మరణించింది.

మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న వెంకటేశ్‌ను విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సినిమాల ప్రభావంతోనే వెంకటేశ్వర్లు ఈ దారుణాలకు ఒడిగట్టాడని జిల్లా ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ చిత్రాల్లో నేర సన్నివేశాలను చూసి ఈ హత్యలకు, దోపిడీలకు పాల్పడినట్లు నిందితుడి తెలిపినట్లు చెప్పారు.

ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని వెంకటేశ్వర్లు ఈ దాడులకు పాల్పడుతుంటాడని పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కూడా సైకో వెంకటేశ్వర్లుపై పలు కేసులున్నాయి. పగలు కోవూరులో నూడిల్స్ దుకాణం నిర్వహిస్తూ, కూలీ పనులు చేస్తూ ఉంటాడని, రాత్రి మాత్రం దోపిడీ దొంగనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు వెంకటేశ్వర్లును కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man allegedly killed a woman in Nellore district, for theft.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి