కొడుకులకు ఉరివేశాడు: భార్య, కూతురు గొంతుకోసి..

A man allegedly kills his sons
రంగారెడ్డి/తూర్పుగోదావరి: రంగారెడ్డి జిల్లాలోని దుండిగల్ సూరారంపాడు బస్తీలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారులను కన్న తండ్రే కాలయముడిగా మారి పాశవికంగా హతమార్చాడు. కుటుంబ కలహాల కారణంగా మేనమామ ఇంటి వద్ద ఉన్న ఇద్దరు చిన్నారులను తండ్రి తనతోపాటు తీసుకెళ్లి.. టవల్‌తో ఉరేసి హత్య చేశాడు.

అనంతరం అతడు కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడ్ని ఆస్పత్రికి తరలించారు.

తల్లీకూతుళ్ల గొంతుకోసిన భర్త

మహబూబ్‌నగర్: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెతోపాటు తన కూతురు గొంతుకోసి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ చటాన్‌పల్లిలో చోటుచేసుకుంది.

ఇది ఇలా ఉండగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారయ్యారు. నిందితులను రామచంద్రాపురం కోర్టులో హాజరుపరిచి విశాఖపట్నంకు తీసుకెళ్తుండగా పరారయ్యారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

కడప జిల్లాలోని రాజంపేట మండలం రామాపురం చెక్ పోస్టు వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+