చెల్లెలితో వివాహేతర సంబంధం: స్నేహితుడి ప్రాణం తీసింది
చిత్తూరు: తన సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడు ఆమె సోదరుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ శ్రీధర్‌నాయుడు తెలిపారు.
చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన హేమంతరాజ(25), సోమశేఖర్(25) విద్యార్థి దశ నుంచే స్నేహితులు. డిప్లమో చదివే రోజుల నుంచి ఇద్దరూ ఒకరింటికొకరు వచ్చి పోతుండేవారు. ఈ క్రమంలో సోమశేఖర్‌కు హేమంతరాజ చెల్లెలు అమృతతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న హేమంతరాజ కుటుంబీకులు అమృతను గుర్రకొండకుచెందిన చిన్నరెడ్డెన్న కుమారుడు రాజు(26)కు ఇచ్చి వివాహం చేశారు.
వివాహానంతరం కూడా సోమశేఖర్.. అమృతతో సాన్నిహిత్యం కారణంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. సోమశేఖర్ బతికున్నంతకాలం అమృత భర్తతో సక్రమంగా కాపురం చేయదని గ్రహించిన ఆమె సోదరుడు హేమంతరాజు.. బావ రాజుతో కలసి సోమశేఖర్ హత్యకు కుట్ర పన్నారు.

అక్టోబర్ 2న సోమశేఖర్, హేమంతరాజు, బావ రాజులు కలసి గుర్రంకొండ మండలంలోని చిట్టిబోయనపల్లె సమీపంలోని బుట్టాయిచెరువు వద్ద ఓ బండపై కూర్చొని మద్యం తాగారు. మద్యం మత్తులోకి జారుకున్న తర్వాత సోమశేఖర్‌పై హెమంతరాజ కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో సోమశేఖర్ చేయి అడ్డం పెట్టగానే ఇద్దరు కలసి బీరు బాటిళ్లతో కొట్టి స్పృహతప్పి పడిపోగానే గొంతు నులిమి చంపేశారు. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు.
కాగా, సోమశేఖర్ తల్లిదండ్రులు అక్టోబర్ 3న కుమారుడు కనిపించలేదని మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 4న గుర్రంకొండ సమీపంలోని చిట్టిబోయనపల్లె వద్ద ఓ యువకుడి మృతదేహం కాలి బూడదైనట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో కలసి సంఘటనాస్థలానికి వెళ్లి కేసు నమోదుచేశారు.
మృతదేహం వద్ద పడి ఉన్న చెప్పులు, దస్తులు ఆధారంగా సోమశేఖర్‌గా గుర్తించారు. దర్యాప్తులో సోమశేఖర్‌ను హతమార్చింది స్నేహితుడు హేమంతరాజు అతడి బావ రాజులుగా తేలింది. శనివారం అంగళ్లు సమీపంలోని సర్కారుతోపు వద్ద నిందితులిద్దరిని అరెస్టుచేశారు పోలీసులు. నిందితుల నుంచి ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీధర్‌నాయుడు తెలిపారు.












Click it and Unblock the Notifications