హోటళ్లో చొరబడి విదేశీ యువతిపై లైంగిక దాడి: ఢిల్లీ యువతుల ఫిర్యాదు
చిత్తూరు: జిల్లాలోని మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. విదేశీ యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జర్మనీకి చెందిన ఇద్దరు యువతులు, ఢిల్లీకి చెందిన మరికొందరు యువతులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లెకు వచ్చారు.
వీరందరు స్థానిక సీటీఎం రోడ్డులోని చైతన్య రెస్టారెంట్‌లో బస చేశారు. అదే రెస్టారెంట్‌లో పనిచేస్తున్న రామాంజనేయులు అనే యువకుడు బుధవారం రాత్రి గది తలుపులు పగులగొట్టి గదిలోనికి చోరబడి జర్మనీకి చెందిన ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మిగిలిన యువతులనూ లైంగికంగా వేధించాడు. ఈ విషయమై గురువారం ఉదయం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలి మృతి
చిత్తూరులోని ధర్మరాజులుగుడి వీధిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో వృద్ధురాలు మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా శింగనమల మండలం ఏకుల నాగేపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో ఓ రైతు మృతి చెందాడు. కృష్ణారెడ్డి(26) అనే రైతు తన పొలంలో గురువారం ఉదయం మోటారు రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు అక్కడే ప్రాణాలు వదిలాడు.












Click it and Unblock the Notifications