అనుమానంతో భార్యను సజీవ దహనం చేసిన భర్త
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమె భర్తే.. ఆమెను సజీవదహనం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు
గుంటూరు: జిల్లాలోని వట్టిచెరుకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమె భర్తే.. ఆమెను సజీవదహనం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన అరుణ(28)కు, వట్టిచెరుకూరుకు చెందిన సుధాకర్‌తో 12 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు జగదీష్, కుమార్తె స్వీటీ ఉన్నారు.

భార్యకు వివాహేతర సంబంధం ఉందని భర్త తరచూ వేధిస్తుండేవాడు. దీంతో నెల రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. ఇటీవల ఇద్దరం కలసి వివాదాలు లేకుండా కాపురం చేసుకుందామని నచ్చ జెప్పి సుధాకర్ ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు.
కాగా, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు వరి గడ్డి కడెం కడదామని చెప్పి పొలానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను కర్రతో విచక్షణా రహితంగా కొట్టి పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడని పోలీసులు తెలిపారు. అంతేగాక, నిందితుడే పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన భార్యను చంపినట్లు అంగీకరించాడని పోలీసులు చెప్పారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications