ప్రేమకు నిరాకరణ: ఫ్రెండ్ భర్తకు అసభ్య మెసేజ్‌లు, అరెస్ట్
హైదరాబాద్: తన స్నేహితురాలి భర్తకు అసభ్య సందేశాలు పంపిన ఓ విద్యార్థి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన నగరంలోని బాగ్‌అంబర్‌పేటలో చోటు చేసుకుంది. నగర సిసిఎస్ డిసిపి పాలరాజు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
బాగ్‌అంబర్‌పేటకు చెందిన బండ్లపల్లి లోకేష్(23) 2011లో డిగ్రీ చేస్తున్న సమయంలో తన సహ విద్యార్థినితో స్నేహం చేశాడు. అదే క్రమంలో ప్రేమిస్తున్నట్లు తెలుపగా నిరాకరించిన ఆమె అతడికి దూరమైంది. అనంతరం ఆమె వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న లోకేశ్ కక్షతో ఆమె వైవాహిక జీవితానికి ఆటంకం కలించాలని కుట్ర పన్నాడు.

ఈ నేపథ్యంలో ఆమె భర్త సెల్ నెంబర్ తెలుసుకుని అసభ్య సందేశాలు పంపించడం మొదలెట్టాడు. గతంలో ఆమెతో దిగిన ఫొటోలను కూడా షేర్ అతడికి చేశాడు. దీంతో బాధితురాలు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకన్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‍పై రాజేంద్రనగర్ పోలీసులు కేసు చేసి అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన కార్తీక్ రెడ్డి(32) రాజేంద్రనగర్ గ్రౌహౌండ్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మెహిదీపట్నంలో నర్సగా పని చేస్తున్న ఓ యువతి(23)తో అతనికి పరిచయం ఏర్పడింది.
ఏడాదిగా ప్రేమించున్న వారిద్దరూ.. మూడు నెలల నుంచి ఆరెమైసమ్మ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. పెళ్లి చేసుకుందామని అడిగిన ప్రతిసారీ దాట వేస్తూ వచ్చిన కార్తీక్‌ను.. ఆ యువతి నిలదీసింది. వారం కిందట అతనికి మరో యువతితో వివాహం నిశ్చయించారన్న విషయం తెలుసుకున్న బాధిత యువతి రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications