అప్పుల బాధతో లాడ్జీలో వ్యక్తి ఆత్మహత్య (ఫొటోలు)

తూర్పుగోదావరి: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారకానగర్ మెయిన్ రోడ్‌లోని ద్వారకా లాడ్జీలో చోటు చేసుకుంది. తన ఆత్మహత్యకు అప్పుల బాధలే కారణమని ఆ వ్యక్తి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. కాగా లాడ్జీ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం... సీతమ్మపేటకు చెందిన చిట్టిమోజుల దుర్గాప్రసాద్ (26) రాజమండ్రి నుంచి స్నేహితులు వస్తున్నారని చెప్పి ఆదివారం రాత్రి ద్వారకా లాడ్జీలో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. అయితే సోమవారం తెల్లవారిన తర్వాత కూడా బయటికి రాకపోవడంతో.. అతని గది తలుపులను కొట్టారు అయినా అతను తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జీ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ సోమరాజు పోలీసు సిబ్బందితో తలుపులను పగులగొట్టి చూడగా దుర్గాప్రసాద్ మృతి చెంది ఉన్నాడు. మృతుని చేతికి ఇంజక్షన్ సెంటర్, పక్కనే ఉన్న టిపాయ్ పై సిరంజి, మత్తు ఇంజక్షన్ బాటిల్ ఉన్నాయి. దీన్ని బట్టి దుర్గాప్రసాద్ పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

మృతుని ప్యాంటు జేబులో ఉన్న సూసైడ్ నోట్, పర్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను రాసిన సూసైడ్ నోట్‌లో ‘అప్పుల బాధతో చనిపోతున్నాను. నన్ను క్షమించండి. మా ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. ఐ మిస్ యు, సారీ సారీ సారీ'అని పేర్కొన్నాడు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న మృతుని భార్య, తల్లి, బంధువులు బోరున విలపించారు.

కాగా తమ వద్ద డబ్బులు తీసుకుని ఫైనాన్స్ చేసేవాడని, ఇప్పుడు తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ప్రసాద్ సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతునికి రెండేళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం వారికి రెండు నెలల పాప ఉంది. ద్వారకానగర్ అపూర్వ ఆస్పత్రిలో వార్డ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

మత్తు ఇంజక్షన్, బాటిల్

మత్తు ఇంజక్షన్, బాటిల్

అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారకానగర్ మెయిన్ రోడ్‌లోని ద్వారకా లాడ్జీలో చోటు చేసుకుంది. మృతుడు దుర్గాప్రసాద్ చేసుకున్న మత్తు ఇంజక్షన్, బాటిల్.

ప్రసాద్ సూసైడ్ నోట్

ప్రసాద్ సూసైడ్ నోట్

అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారకానగర్ మెయిన్ రోడ్‌లోని ద్వారకా లాడ్జీలో చోటు చేసుకుంది. ‘అప్పుల బాధతో చనిపోతున్నాను. నన్ను క్షమించండి. మా ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. ఐ మిస్ యు, సారీ సారీ సారీ'అని తన సూసైడ్ నోట్‌లో దుర్గా ప్రసాద్ పేర్కొన్నాడు.

విగత జీవిగా ప్రసాద్

విగత జీవిగా ప్రసాద్

అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారకానగర్ మెయిన్ రోడ్‌లోని ద్వారకా లాడ్జీలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ సోమరాజు పోలీసు సిబ్బందితో తలుపులను పగులగొట్టి చూడగా దుర్గాప్రసాద్ మృతి చెంది ఉన్నాడు.

తన భార్యతో దుర్గాప్రసాద్

తన భార్యతో దుర్గాప్రసాద్

అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారకానగర్ మెయిన్ రోడ్‌లోని ద్వారకా లాడ్జీలో చోటు చేసుకుంది. తన ఆత్మహత్యకు అప్పుల బాధలే కారణమని మృతుడు దుర్గాప్రసాద్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+