'ఏ అంటే ఆంధ్రా, బీ అంటే బాబు': బాబుకు, జగన్‌కు తేడాపై మంత్రి పల్లె

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబుపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ప్రశంసలు జల్లు కురిపించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత జిల్లాలోని జి.మేడపాడులో జరిగిన బహిరంగ సభలో కేఈ మాట్లాడుతూ...

ఏపీలో అంతా 'ఏబీసీ'ల గురించే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ఈ మూడక్షరాల అర్థాలను కూడా ఆయన సభికులకు వివరించారు. ఇందులో ఏ అంటే ఆంధ్రా, బీ అంటే బాబు, సీ అంటే కంప్యూటర్‌ అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో సభకు హాజరూనవారంతా కరతాళ ధ్వనులతో కేఈ వ్యాఖ్యలను స్వాగతించారు.

మరో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు కరువు జిల్లాల్లో పంటలను రెయిన్‌ గన్స్‌తో కాపాడి అపార భగీరథుడిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ప్రత్యేకహోదా కోసం ఏ పార్టీ వారైనా సహకరిస్తే స్వాగతిస్తామని సామర్లకోటలో అన్నారు.

ఆదివారం ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవనలో మంత్రులు రావెల కిశోర్‌బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, విప్‌ యామినిబాలలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి రావెల మాట్లాడుతూ కరువును దీటుగా ఎదుర్కొన్న ఘనత చంద్రబాబుదని అన్నారు. జగన్‌ మూర్ఖుడని, అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని బొజ్జల విమర్శించారు.

A means andhra, B means babu says ap Tdp Leaders

మేఘమధనం ద్వారా వర్షాలు కురిపిస్తామని రఘువీరారెడ్డి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అరచేతిలో వైకుంఠం చూపి నిధులు స్వాహాచేశారని ఆయన ఆరోపించారు. కోర్టులను అవమానపరిచేలా, తీర్పులను అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేసిన జగన్‌పై కోర్టు ధిక్కార పిటిషన దాఖలు చేస్తామని ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ పేర్కొన్నారు.

చంద్రబాబుకు, జగన్‌కు అదే తేడా

ప్రతిపక్ష నేత జగన్‌ది గన్‌ పెట్టి దోచుకునే సంస్కృతి అయితే, సీఎం చంద్రబాబుది రెయిన్‌ గన్స్‌తో రైతులను ఆదుకునే సంస్కృతి అని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి రాయలసీమకు నీళ్లిస్తామని చెప్పారు.

సీమ రైతులతో పాటు జగన్‌ పొలానికి నీళ్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల క్రితమే తన ఇంట్లో రెయిన్‌ గన్స్‌ ఉన్నాయన్న జగన్‌ రైతులను ఎందుకు ఆదుకోలేదని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే జగన్‌కు రైతులే బుద్ధి చెబుతారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+