భార్యపై అలిగి భర్త ఆత్మహత్య: ముగ్గురికి జైలు శిక్ష
గుంటూరు: ఆధ్యాత్మిక క్షేత్రం గుత్తికొండ బిళానికి వెళ్లేందుకు ప్రయాణపు ఖర్చులు ఇవ్వలేదని భార్యపై అలిగి ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - నారాయణపురానికి చెందిన గరికపాటి శ్రీనివాసరావు (38) ఆటో డ్రైవర్. అతడి భార్య అరుణ అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తోంది.
శ్రీనివాసరావు నిత్యం తాగుతూ గొడవ చేస్తుంటాడు. ఐతే గుత్తికొండ బిళానికి వెళ్లేందుకు డబ్బులు కావాలని భార్యను అడిగాడు. అందుకు తన దగ్గర డబ్బులు లేవని ఆమె చెప్పింది. దీంతో ఖర్చులకు డబ్బు ఇవ్వలేదన్న అలిగి ఇంట్లోకి జొరబడి ఉరి వేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవితఖైదు పడినట్లు గుంటూరు జిల్లా నిజాంపట్నం ఎస్‌ఐ షేక్ మహ్మద్ షఫీ తెలిపారు. 2011లో ముత్తుపల్లి గ్రామ సమీపంలో లింగినేని మురళీ అలియాస్ బాబు అనే వ్యక్తిని సోమరౌతు వెంకట నాగేశ్వరరావు అలియాస్ రాజా, లింగినేని దుర్గాప్రసాద్ అలియాస్ దుర్గ, సోమరౌతు భుజంగరావు అలియస్ బుజ్జి అనే వ్యక్తులు దాడి చేసి హత్య చేశారన్నారు.
ఈ కేసులో తెనాలి పాస్ట్ ట్రాక్ కోర్టు నిందితులకు జీవితఖైదు, రూ.వెయ్యి అపరాధ రుసుం విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.












Click it and Unblock the Notifications