విహారంలో విషాదం: జర్మనీలో ఏపీ యువకుడి మృతి
జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
బెర్లిన్: జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లా కొండపి మండలం కట్టవారిపాలేనికి చెందిన మల్లిఖార్జున రావు(22) అనే యువకుడు జర్మనీలోని ఈఎస్ఎస్ఎన్ సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌గా పనిచేస్తున్నాడు.
వారాంతం కావడంతో ఆదివారం మరికొందరితో కలిసి నదిలో విహారయాత్రకు వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడటంతో మల్లిఖార్జునరావు మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందడంతో మృతుడి స్వగ్రామం కట్టవారిపాలేంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

మల్లికార్జనరావు మృతితో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మల్లికార్జన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications