కీచక ప్రిన్సిపాల్ నిర్వాకం: ఏడో తరగతి విద్యార్థినికి గర్భం
ప్రకాశం: విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పి మంచిమార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. కీచకుడిలా మారి మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అనారోగ్యంగా ఉన్న ఆమెను బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ అఘాయిత్యం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని దర్శిలోని తూర్పు చవటపాలెం రోడ్డులో నివసించే 14 ఏళ్ల బాలికకు తల్లిదండ్రులు లేరు. మామయ్య సంరక్షణలో ఉన్న ఆమె స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బుధవారం బంధువులు ఒంగోలులోని రిమ్స్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.

ఆరు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చాక్లెట్లు ఇస్తానని ప్రిన్సిపాల్ జాయ్ తనను లొంగదీసుకున్నట్టు బాధితురాలు వెల్లడించినట్టు సమాచారం. ఈ విద్యార్థిని నిరుడు అదే స్కూల్లో 3వ తరగతి చదివింది. అయితే, నేరుగా 7వ తరగతిలో చేర్పించి బాగా చదివిస్తానని కూడా ప్రన్సిపాల్ ఆశ చూపినట్టు సమాచారం.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్ జాయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, బాలికతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వ్యాసెక్టమీ సర్జరీ చేయించుకున్నానని, తన వల్ల గర్భం వచ్చే అవకాశమే లేదని ప్రిన్సిపాల్ పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. కాగా, ఘటనపై పోలీసులు అధికారికంగా ఏ వివరాలు వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications