గుంటూరులో అరుదైన ఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మ

గుంటూరులోని సిటిజన్ హాస్పిటల్ వైద్యులు మెడికల్ మిరాకిల్ చేసి చూపించారు. పెళ్లి జరిగి ఐదేళ్లు అవుతున్న పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్న మహిళకు పిల్లలు కలిగేలా చేశారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఒకే కాన్పులో ముగ్గురు ఆడ పిల్లలకు ఆమె జన్మనివ్వడం. మహిళ, పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో వారి కుటుంబం ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదుకు చెందిన పద్మావతికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహం జరిగినప్పటి నుంచి పిల్లలు లేకపోవడంతో మానసికంగా ఆవేదన చెందుతుంది. ఈ క్రమంలోనే పలు హాస్పిటల్స్ కూడా తిరిగి ఇబ్బందులు పడింది. కానీ ఆమెకు మాత్రం పిల్లలు పుట్టలేదు. అయితే గుంటూరు సిటిజన్ హాస్పిటల్ లో ప్రముఖ డాక్టర్ భాగ్యలక్ష్మి దగ్గర సంప్రదించగా ఆమె పరివేక్షణలో వైద్య సేవలను పొందుతూ గర్భం దాల్చింది. ముగ్గురు ఆడశిశువుల్లో ఇద్దరు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు.

a-rare-incident-in-guntur-three-children-born-in-one-delivery

గత ఆదివారం నాడు ఆమె ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా పిల్లలు లేని మహిళకు ఇప్పుడు ఒకే కాన్పులో మగ్గురు జన్మించడం అద్భుత సంఘటన ఒబెస్ట్రిక్ అండ్ గైనకాలజీ డాక్టర్ ఎస్ భాగ్యలక్ష్మి తెలిపారు. పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి గుంటూరు సిటిజన్ హాస్పిటల్ లో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో చికిత్స అందిస్తున్నామని ఆమె చెప్పారు. ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్ లో సహకారం అందించిన పీడియాట్రిషన్ డాక్టర్ రాజాని, హాస్పటల్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

మహిళ గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఏకకాలంలో ఫలదీకరణం చెందడం వల్ల ఒకే కాన్పుల్లో ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని డాక్టర్లు తెలిపారు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చని చెప్పారు. ఒకే కాన్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణమని, అయితే ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టడాన్ని పాలీజైగోటిక్ అంటారని స్పష్టం చేశారు. తెలిపారు వైద్యులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+