పెళ్లికి నిరాకరించిందని యువతిపై పెట్రోల్ పోశాడు, క్వారీలో పేలుడు: ముగ్గురి మృతి
హైదరాబాద్: తనని పెళ్లి చేసుకోవాలంటూ చేసిన ప్రతిపాదనను తిరస్కరించిందనే అక్కసులతో ఓ దుర్మార్గుడు ఓ యువతిపై పెట్రోల్ పోశాడు. మెదక్ జిల్లా సిధ్ధిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
బాధిత యువతిని అంజాద్ అనే యువకుడు గత ఏడాది కాలంగా పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడు. ఎంతకూ ఒప్పుకోక పోవడంతో ఆదివారం ఆమెపై పెట్రోల్ పోసి పరారయ్యేందుకు యత్నించాడు.
దీంతో యువతి కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు పెట్రోల్ చల్లిన యువకునికి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

గ్రానైట్ క్వారీలో పేలుడు: ముగ్గురి మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ శివారులోని చింతలగుట్టపై గల గ్రానైట్ క్వారీలో డిటోనేటర్లు పేలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. సాయి ఎంటర్‌ఫ్రైజేస్ కంపెనీ పేరు మీద గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి.
క్వారీలో పని చేస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అజయ్‌నాయక్ (22), రాహుల్‌నాయక్ (21), తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరియప్పన్ (47)లు పని చేస్తున్న సమయంలో డిటోనేటర్లు పేలి అక్కడికక్కడే మృతి చెందారు. ఒరిస్సాకు చెందిన మరో కార్మికుడు బీకార్‌నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి
వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామశివారు రాముతండాకు చెందిన మహిళా రైతు లూనావత్ లక్ష్మి (35) విద్యుదాఘాతంతో శనివారం మృతి చెందింది. రాముతండాశివారులోని వ్యవసాయ బావి వద్ద లక్ష్మి రబీలో వేసుకున్న వరిపొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి బోరుస్టార్టర్‌ను ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందింది.
నిజామాబాద్‌లో విద్యార్థి అదృశ్యం
ఆరోతరగతి చదువుతున్న షేక్‌మాజిద్ అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ అపహరణ నిజామాబాద్‌లోని నిజాంకాలనీలో చోటుచేసుకుంది. విద్యార్థి తల్లిదండ్రులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications