Jagan Govt:న్యాయస్థానాల్లో వైసీపీకి బిగ్ రిలీఫ్ -ఎన్నికల వేళ వరుసగా..!!
వైసీపీకి ఎన్నికల వేళ న్యాయస్థానాల్లో బిగ్ రిలీఫ్ దొరుకుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సార్లు కోర్టులో ప్రభుత్వ నిర్ణయాలకు ఎదురు దెబ్బ తగిలింది. కానీ, తాజాగా కోర్టుల్లో వస్తున్న అనుకూల తీర్పులతో ప్రభుత్వం తమ నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తోంది. అందులో ప్రధానంగా వైసీపీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ పైన సుప్రీం తీర్పు..తాజాగా అమరావతి లో ఇళ్ళ స్థలాలా కేటాయింపు విషయంలో వచ్చిన జడ్జిమెంట్ ప్రభుత్వానికి రిలీఫ్ కానుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు కేసుల్లో ప్రభుత్వ నిర్ణయాలు నిలబడ లేదు. న్యాయస్థానాల్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. జీవో నెంబర్ 1 పైన హైకోర్టులో తీర్పు రావాల్సి ఉంది. జీవో నెంబర్ 1 అమలు కూడా ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన విరుచుకుపడ్డాయి.

ముందుగా హైకోర్టు వెకేషన్ బెంచ్ జీవో అమలు పైన స్టే ఇచ్చింది. ఆ తరువాత విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక...టీడీపీ హయాంలో జరిగిన అవినీతి పైన విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పైన సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఇది ప్రతిపక్షాలకు షాకింగ్ గా అధికార వైసీపీ విశ్లేషిస్తోంది.
అమరావతిలో పేదలకు ఇళ్లు కోసం స్థలాలు కేటాయింపు పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని అమరావతి ప్రాంత వాసులు అభ్యంతరం చెబుతూ న్యాయస్థానం ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇంటి స్థలాల మంజూరుకు మార్గం సుగమం చేస్తూ తీర్పు వెలువడింది.
ఈ రెండు నిర్ణయాల వెల్లడి సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అమరావతి ఇంటి స్థలాల విషయంలో ప్రభుత్వానికి ఎన్నికల వేళ బిగ్ రిలీఫ్ గా భావిస్తున్నారు. రెండు జిల్లాలకు చెందిన పేదలకు ఇక్కడ స్థలాలు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. కోర్టు తీర్పు అనుకూలంగా రావటంతో ఇప్పుడు ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. వైసీపీ ప్రభుత్వం న్యాయస్థానం తీర్పు పేదల విజయంగా చెప్పుకొస్తోంది.












Click it and Unblock the Notifications