అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్:స్వర్ణ బార్ కూలర్ నీటిలో సైనేడ్ , నిర్దారించిన 'సిట్'

విజయవాడ స్వర్ణబార్ లో 2015 లో చోటుచేసుకొన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. ఈ బార్ లో చోటుచేసుకొన్న ఘటనతో ఈ బార్ రాష్ట్ర వ్యాప్తంగా పేరొందింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ స్వర్ణబార్ లో 2015 లో చోటుచేసుకొన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. ఈ బార్ లో చోటుచేసుకొన్న ఘటనతో ఈ బార్ రాష్ట్ర వ్యాప్తంగా పేరొందింది.ఈ బార్ లో ఉపయోగించిన కూలర్ నీటిలో సైనైడ్ కలిపారని సిట్ గుర్తించింది.

స్వర్ణబార్ లోని మద్యం సేవించి ఐదుగురు చనిపోయారు.విజయవాడ స్వర్ణ బార్ లో 2015 డిసెంబర్ 7వ, తేదిన మద్యం సేవించి ఐదుగురు మరణించారు.మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ బార్ కృష్ణలంకలోని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బంధువులకు చెందింది.

A shocking incident found SIT team on Swarna Bar case

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. డీజీపి స్వయంగా ఘటనా స్థలికి వెళ్ళి పరిశీలించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే స్వర్ణ బార్ లోని కూలర్ నీటిలో సైనైడ్ కలిపినట్టు సిట్ నిర్ధారించింది. అయితే సైనైడ్ ను ఎవరైనా కలిపారా లేదా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది.అయితే ఐదుగురు ప్రాణాల పోగొట్టుకొన్న ఘటనకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని సిట్ దర్యాప్తుకు ఆదేశించింది.సిట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

English summary
A shocking incident found SIT team on Swarna Bar case, in cooler water mix with poison, who mixed poison with water didn't identified yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X