వాష్‌రూంలో యువతుల వీడియో చిత్రీకరణ: కేసు

ఎల్బీనగర్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో సాగర్(27) అడ్మినిస్ట్రేషన్ విభాగం మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మాల్‌లో పని చేసే సేల్స్ గర్ల్స్ వాష్‌రూంలో పిచ్చాపాటి మాట్లాడుతూ.. సమయాన్ని వృథా చేస్తున్నారని వారిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాలని అక్కడే పని చేస్తున్న సెక్యూరిటీ అధికారిణికి సాగర్ తన సెల్‌ఫోన్ ఇచ్చి పంపాడు.
దీంతో ఆగస్టు 24న రాత్రి షాపింగ్ మాల్‌లోని వాష్ రూంలో యువతుల దృశ్యాలను చిత్రీకరించిన సెక్యూరిటీ అధికారిణి.. మేనేజర్ సాగర్‌కు ఆ వీడియోలను అందించింది.
దీంతో బాధిత యువతులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిత్రీకరించిన వీడియోలతో తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధిత యువతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేనేజర్ సాగర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications