కోడలితో మామ అక్రమ సంబంధం : తండ్రిని కడతేర్చిన కొడుకు
చిత్తూరు : కోడలితో మామ అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో.. కన్న కొడుకే తండ్రిని కడతేర్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. హత్యానంతరం తండ్రి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన సదరు వ్యక్తిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని ఉగిని గ్రామానికి చెందిన శ్రీనివాసప్పకు నరసింహులు అనే వికలాంగ కుమారుడు ఉన్నాడు. కాగా, నరసింహులుకు ఇటీవలే వివాహమైంది. అదే సమయంలో.. తన భార్యతో తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానం నరసింహులులో బలపడింది.

దీంతో ఎలాగైనా తండ్రిని హతం చేయాలనుకున్నాడు. ఇందుకోసం అదే గ్రామానికి చెందిన గఫార్, గౌస్ లతో కలిసి తండ్రి హత్యకు ప్లాన్ చేశాడు. ముందస్తు వ్యూహాం ప్రకారం.. ఓరోజు శ్రీనివాసప్పకు పూటుగా మద్యం తాగించి, సమీపంలోని మామిడి తోటల్లోకి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం అక్కడే పూడ్చి పెట్టారు. ఇదంతా జరిగాక, తన తండ్రి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు నరసింహులు.
విచారణ ప్రారంభించిన పోలీసులు.. నరసింహులు నుంచి వివరాలు రాబడుతున్న క్రమంలో పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. నరసింహులుతో పాటు హత్యలో పాల్గొన్న గఫార్, గౌస్ లను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications