జగన్ బర్త్ డే వేళ తాడేపల్లిలో కేసీఆర్, కేటీఆర్..! అంతా ఇదే చర్చ..!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏపీకి చెందిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూ, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ కు ఉన్న బంధం అందరికీ తెలిసిందే. గతంలో జగన్ సీఎం కాకముందు నుంచే అప్పటి టీఆర్ఎస్ తో వైసీపీ బంధం కొనసాగేది. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక కూడా కేసీఆర్, కేటీఆర్ తో కలిసి నడిచారు. అయితే మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా తాజాగా కేటీఆర్ తో జగన్ ప్రైవేట్ కార్యక్రమంలో కనిపించారు కూడా.
ఈ నేపథ్యంలో రేపు పుట్టినరోజు జరుపుకునేందుకు వైఎస్ జగన్ సిద్దమవుతున్నారు. ఇలాంటి తరుణంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కమ్ జగన్ నివాసం ముందు భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ లు జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఈ పోస్టర్లు ఉన్నాయి. వైఎస్ జగన్ తో కేసీఆర్, కేటీఆర్ బంధాన్ని గుర్తుచేసేలా వీటిని ఏర్పాటు చేశారు.

రేపు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ కేంద్ర కార్యాలయం సహా మరికొన్ని చోట్ల కేసీఆర్, కేటీఆర్ భారీ కటౌట్లు ఏర్పాట్లు చేసి ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణకు చెందిన కొందరు నేతలు వీటిని ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లికి చెందిన డాక్టర రవీందర్ పేరుతో ఈ భారీ కటౌట్ లు వెలిశాయి. తాడేపల్లిలో తిరిగే వారిని ఈ కటౌట్లు ఆకర్షిస్తున్నాయి. తాజాగా జగన్ హైదరాబాద్ టూర్ లోనూ అక్కడి బీఆర్ఎస్ నేతలు జనసమీకరణ చేశారు. ఇప్పుడు జగన్ ఇంటివరకూ ఈ అభిమానం వచ్చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications