అమెరికా: కొలనులో పడి తెలుగు యువతి మృతి

నెల్లూరు: అమెరికాలోని ఓ కొలనులో ప్రమాదవశాత్తు పడిపోయి ఓ తెలుగు యువతి మృతిచెందింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని చేవూరివారితోటలోని గోగినేని వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతుల కుమార్తె ప్రియాంక చౌదరి(25) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.

హైదరాబాద్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ప్రియాంక.. అనంతరం అమెరికాలోని వాషింగ్టన్‌లో ఎంఎస్‌ చదివింది. నెలరోజుల క్రితం లాస్‌వేగాస్‌లోని ఓ సంస్థలో సివిల్‌ ఇంజినీర్‌గా చేరింది.

A telugu girl died in america

రోజూ మాదిరిగానే బుధవారం వాకింగ్‌కు వెళ్లిన ప్రియాంక హిక్‌లేట్‌ అనే కొలను దగ్గరకు కాళ్లు కడుక్కునేందుకు వెళ్లి.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. ఎవరూ గమనించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ప్రియాంక మరణవార్త గురువారం ఉదయం తల్లిదండ్రులకు చేరడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతదేహం సోమవారంలోగా కావలికి చేరుకోనున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+