మోడీ చెప్పినట్లు చేసి.. రూ. లక్ష పట్టేసిన తెలుగు మహిళ

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/చిత్తూరు: ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు అనంతరం నుంచి నగదు రహిత లావాదేవీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకంగా అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నగదు రహిత లావాదేవీలను పెంచితే బహుమతులు అందిస్తామని, ప్రతి ఒక్కరూ కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, నగదు రహిత క్రయ, విక్రయాలు జరపాలని పిలుపునిచ్చారు.

కాగా, ప్రధాని మోడీ చెప్పిన మాటలను ఆచరించిన చిత్తూరు జిల్లా కార్వేటి నగరానికి చెందిన నాగమ్మ అనే యువతిని అదృష్టం వరించింది. చౌక దుకాణాల ద్వారా నిత్యావసరాలను కార్డు చెల్లింపులతో కొనుగోలు చేసిన వారికి లక్కీ డిప్ నిర్వహించగా.. నాగమ్మకు రూ. లక్ష బహుమతి లభించింది.

A telugu woman get Rs 1 lac for cashless transactions

ఇక ఇదే స్కీములో భాగంగా 528 మందికి సెల్ ఫోన్లనూ బహుమతిగా అందించనున్నామని అధికారులు వెల్లడించారు. అమరావతిలో జరిగిన నగదు భద్రతా దినోత్సవాల్లో భాగంగా, డ్రా తీయగా నాగమ్మ పేరు వచ్చిందని అధికారులు వెల్లడించారు. అందరు విజేతల పేర్ల జాబితాలను రెండ్రోజుల్లోగా ఎమ్మార్వో కార్యాలయాలకు పంపి నోటీసు బోర్డుల్లో ఉంచుతామని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A telugu woman, belongs to Chittoor district, will get Rs 1 lac for cashless transactions.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి