వాకింగ్‌కు వెళ్లిన టిడిపి కార్యకర్త దారుణ హత్య
అనంతపురం: ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఉరవకొండ మండలం షేక్‌సాన్‌పల్లిలో టిడిపి కార్యకర్త నారాయణస్వామి వాకింగ్ చేస్తుండగా రాళ్లతో కొట్టి చంపారు.
పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో టిడిపి డివిజన్ నేత మృతి

మొగల్రాజపురం 6వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు పడాల కన్నారావు సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో మారుతీనగర్‌కు ఆనుకుని ఉన్న కాల్వకట్ట వద్ద పురుషుడి మృతదేహం ఉందని గుణదల పోలీసులకు సమాచారం వచ్చింది.
సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ ఉమామహేశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలను బట్టి చనిపోయింది 6వ డివిజన్‌కు చెందిన టిడిపి నాయకుడు పడాల కన్నబాబుగా గుర్తించారు. సమాచారం వెంటనే కుటుంబసభ్యులకు అందించారు.
ఘటనా స్థలం వద్దకు వచ్చిన కుటుంబసభ్యులు మృతదేహాన్ని చూసి తీవ్రంగా విలపించారు. ఆదివారం రాత్రి పని మీద బయటకు వెళ్ళాడని తిరిగి శవమై కనిపించాడని వారు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications