సంక్రాంతి తర్వాత ఏపీలో మళ్ళీ మూడురోజుల పండుగ.. రెడీ అవ్వమన్న చంద్రబాబు!

సంక్రాంతి పండుగ తర్వాత ఏపీలో మూడు రోజుల పండుగ రాబోతుంది. ఈ పండుగకు అందాల అరకు రారమ్మని పిలుస్తోంది. ఈ శీతాకాలంలో అందాల అరకును చూడటానికి పర్యాటకులు భారీగా అరకు వెళ్తుంటారు. అటువంటి అరకు అందాలను వీక్షించే వారికి అరకులో మూడు రోజుల పాటు జరగనున్న అరకు ఉత్సవాలు ఆకట్టుకోనున్నాయి.

మూడు రోజుల పాటు అరకు ఉత్సవాలు
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అరకు ఉత్సవాలు అక్కడి సంస్కృతిని తెలియజేసేలా ఘనంగా జరిగాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వం అరకు ఉత్సవాలను నిర్వహించలేదు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావటంతో అరకు ఉత్సవాలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ అరకు ఉత్సవ్ ;లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పలు ప్రదర్శనలు నిర్వహిస్తారు. సాంప్రదాయ గిరిజన నృత్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటారు.

A three-day festival in AP after Sankranti Araku Utsav plastic ban in araku

సాంప్రదాయ గిరిజన నృత్యాలతో సందడిగా అరకు
శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన సవర, కొమ్ము బూర, కోయ నృత్య ప్రదర్శనలతో పాటు స్ట్రీట్ డ్యాన్స్ లు ఆకట్టుకుంటాయి. ఈ మేరకు తాజాగా జనవరి 31వ తేదీ నుండి మూడు రోజుల పాటు అరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక మండలి చైర్మన్ ఎఎస్ దినేష్ కుమార్ ప్రకటించారు.

అరకు ఉత్సవ్ లో స్పెషల్ ఎట్రాక్షన్స్
అరకు ఉత్సవాలే కాదు, మారేడుమిల్లి ఉత్సవాలు ఫిబ్రవరి 23, 24, 25 తేదీలల్లో మారేడుమిల్లి లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అరకు ఉత్సవ్‌లో భాగంగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, రంగోలి పోటీలు, ఆటలు నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక మండలి చైర్మన్ ఎఎస్ దినేష్ కుమార్ ప్రకటించారు.

అరకులో ప్లాస్టిక్ నిషేధం
అదేవిధంగా అరకు, బొర్రాగుహలును ప్లాస్టిక్ ఫ్రీ డెస్టినేషన్ గా ప్రకటించడం జరిగిందని, అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో చిన్న సైజు నుండి రెండు లీటర్ల వరకు గల ప్లాస్టిక్ వాటర్ బోటల్స్ ను కూడా నిషేదించడం జరిగిందని స్పష్టం చేసారు. ఆయా ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జనవరి ఒకటి నుండి ప్లాస్టిక్ రహిత పర్యాటక ప్రాంతంగా అరకు
ఆయా ప్రాంతాలలో ప్లాస్టిక్ వస్తువులు వినియోగం, కొనడం, అమ్మడం లాంటి వ్యవహారాలు నిషేధమని స్పష్టం చేసారు. ఈ నిబంధనలు జనవరి ఒకటి నుండి అమలులోకి వస్తాయన్నారు. అరకు, మారేడుమిల్లి ఉత్సవాల నిర్వహణకు మూడేసి కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం జరిగిందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+