వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యం వికటించి మూడు నెలల బాలుడు మృతి.. బాపట్ల జిల్లాలో దారుణం; బంధువుల ఆందోళన!!

|
Google Oneindia TeluguNews

వైద్యో నారాయణో హరి అంటారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో ఓ మూడు నెలల బాలుడు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే

అనారోగ్యంతో ఆస్పత్రిలో మూడునెలల బాబు.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి


భట్టిప్రోలుకు చెందిన మౌనిక అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడు నెలల కుమారుడిని శనివారం రాత్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది. చిన్నారిని ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్య సిబ్బంది తమ పర్యవేక్షణలోనే బాలుడిని ఉంచుకున్నారు. వైద్యులు బాబును పరీక్షించలేదు. వైద్యం చెయ్యలేదు. నర్సులు అనారోగ్యం బారిన పడిన బాలుడికి వైద్యం చేశారు. ఆ తర్వాత సోమవారం సాయంత్రం మూడు గంటల సమయంలో బాలుడి ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పిన సిబ్బంది, 5 గంటల సమయంలో బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులకు తెలిపారు.

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన.. నర్సుల వైద్యమే కారణమని ఆగ్రహం

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన.. నర్సుల వైద్యమే కారణమని ఆగ్రహం

ఆరోగ్యంగా ఉంటాడు అనుకున్న కొడుకు చనిపోవడంతో తల్లి మౌనిక స్పృహ కోల్పోయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే పసి బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సులు చికిత్స చేయడం వల్ల బాలుడు మృతి చెందాడని ఆరోపించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సదరు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పసివాడి ప్రాణం కాపాడతారని ఆసుపత్రికి వస్తే, వచ్చీరాని వైద్యంతో నర్సులు పసివాడి ప్రాణానికే ముప్పు తెచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆస్పత్రి యాజమాన్యం, బాధ్యలపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి

ఆస్పత్రి యాజమాన్యం, బాధ్యలపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యులు వైద్యం విషయంలో నిర్లక్ష్యం వద్దని పదేపదే చెప్తున్నా వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల పాలిట యమపాశంలా మారింది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేస్తున్న విడదల రజిని ఈ తరహా నిర్లక్ష్యం సహించేది లేదని చెప్పి, ఇప్పటికే అనేక సార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా ఏపీలో మాత్రం అనేక ఆస్పత్రులలో పరిస్థితి ఏ మాత్రం మారలేదు.

English summary
The incident where a three-month-old boy died due to medical malpractice took place in a private hospital in Repalle, Bapatla district. The relatives expressed their anger and worried about the negligence of the doctors
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X