పచ్చడి పెడుతూ సీతారామన్, వీడియో వైరల్: మోడీ మరో ఆలోచన
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మినహా ఇంతవరకు ఎవరూ పర్యవేక్షించని రక్షణ శాఖ బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోడీ.. నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు.
అమరావతి/హైదరాబాద్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మినహా ఇంతవరకు ఎవరూ పర్యవేక్షించని రక్షణ శాఖ బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోడీ.. నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు.

నిర్మలా సీతారామన్ వీడియో హల్‌చల్
నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ మంత్రి అయిన తర్వాత నాటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలో మంత్రిగా ఉన్న ఆమె, తమ ఇంటి వ్యవహారాల్లో, ముఖ్యంగా పచ్చళ్లు పెట్టడం వంటి విషయాల్లో ఆమె ఆసక్తి కనబరిచేవారు.
నిర్మల ఆవకాయ పచ్చడి పెడుతున్న వీడియో
ఈ విషయాన్ని తెలియజేస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. సుమారు నాలుగేళ్ల కిందటి ఈ వీడియోలో నిర్మలా సీతారామన్ తన తల్లితో కలిసి ఆవకాయ పచ్చడి పెడుతున్నారు.

మోడీ నిర్ణయంతో ఆశ్చర్యం
నిర్మలా సీతారామన్ పైన ప్రధాని మోడీ పెద్ద బరువే పెట్టారు. ఓ జూనియర్ కేంద్రమంత్రికి, ఇప్పటి వరకు కేంద్ర సహాయమంత్రిగా ఉన్న ఆమెకు ఏకంగా రక్షణ శాఖను ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మోడీ నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేసింది.

నిర్మల అర్థం చేసుకునే వరకు ఆర్నెళ్లు పడుతుందని
రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ దానిని అర్థం చేసుకునే వరకే ఆరు నెలలు పడుతుందని కొందరు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. నిర్మలపై చాలా పెద్దబరువు వేశారని అంటున్నారు. అయితే ఆమె దక్షత చూసిన తర్వాతే మోడీ ఇంత కీలకమైన బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.

ఇది మోడీ మరో ఆలోచనా?
సీనియర్లకు రక్షణ శాఖను అప్పగిస్తే తన మాట ఎక్కువగా చెల్లుబాటు కాదని, అందుకే నిర్మలకు ఇచ్చి ఉంటారని కొందరు అంటున్నారు. నిర్మలకు ఇవ్వడం ద్వారా రక్షణ శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలలో తన పాత్ర కూడా పోషించవచ్చునని భావించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అందుకే మోడీ అప్పగించారు
అయితే, అదంతా వట్టిదేనని, నిర్మలా సీతారామన్ దక్షత చూసి ఇచ్చారని ఇంకొందరు చెబుతున్నారు. ఆమె నీతి, నిజాయితీతో పని చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. సీనియార్టీ, అనుభవం కాకుండా దక్షతను బట్టి, ఎన్నికల యాంగిల్‌లో పదవులు ఇచ్చారని అంటున్నారు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications